Thank You Teaser: లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికొచ్చా: నాగ చైతన్య
Thank You Teaser. Naga Chaitanya`s Thank You Movie Teaser out. అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `థ్యాంక్ యూ` చిత్రం టీజర్‌ను రిలీజ్ అయింది.
Naga Chaitanya, Raashi Khanna starrer Thank You Movie Teaser out: అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'థ్యాంక్ యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. చైతు సరసన రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అవిక గోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న థ్యాంక్ యూ సినిమా.. ఎట్టకేలకు జూలై 8న విడుదల అవుతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈరోజు టీజర్‌ను వదిలింది చిత్ర బృందం.
ముందుగా ప్రకటించినట్టుగానే 'థ్యాంక్ యూ' మేకర్స్ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ అందించారు. బుధవారం (మే 25) సాయంత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఒక నిమిషం 18 సెకండ్ల నిడివి గల ఈ టీజర్.. 'నా సక్సెస్‌కు కేవలం కారణం నేనే' అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్‌తో ఆరంభం అయింది. 'మీరు తప్ప మీ లైఫ్‌లో ఇంకొక్కరికి చోటే లేదు', 'లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికొచ్చా', 'నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే ఇది' అనే డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
రొమాంటిక్ కామెడీగా రూపొందిన 'థ్యాంక్ యూ' సినిమాలో నాగ చైతన్య.. క్లాస్, మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికొచ్చా అంటూ చై చెప్పిన డైలాగ్ చాలా ఆసక్తిగా ఉంది. చైతు నిజజీవితానికి చాలా చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ డైలాగ్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. మొత్తానికి లవ్ ట్రాక్, రొమాంటిక్ సన్నివేవాలతో రూపొందిన థ్యాంక్ యూ టీజర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది.
థ్యాంక్ యూ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించగా.. పీసీ శ్రీరామ్ కెమెరామెన్గా పని చేశారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం 'మనం' తర్వాత విక్రమ్ కె. కుమార్, నాగ చైతన్య కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చూడాలి మరి మనం లాంటి హిట్ అందుకుంటుందో లేదో.
Also Read: Beggar Buy Bike: భార్యకు ప్రేమతో.. 90 వేల బైక్ కొన్న బిచ్చగాడు! రోజువారీ సంపాదన తెలిస్తే షాకే
Also Read: Video: ఈ చిన్నారి సంకల్పానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒంటికాలితో గెంతుతూ స్కూల్‌కు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి