Manchu Manoj: ఆ ఒక్కడు మా అన్నను టార్గెట్ చేశాడు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్..
Manchu Manoj on MAA Association Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తన అన్నయ్య మంచు విష్ణును ఓ వ్యక్తి కావాలనే టార్గెట్ చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. ప్రతీసారి తన అన్నయ్యను టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బందులకు గురిచేయాలనుకున్నాడని అన్నారు.
Manchu Manoj on MAA Association Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో మంచు విష్ణు ప్యానెల్‌కి, ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కి మధ్య ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ మొత్తం రెండు ప్యానెల్స్ మధ్యన చీలిపోయింది. సాధారణ ఎన్నికలను తలపించేలా జరిగిన ఆ ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అప్పటి పరిణామాలపై హీరో, మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్వహించిన శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవంలో మనోజ్ మాట్లాడారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తన అన్నయ్య మంచు విష్ణును ఓ వ్యక్తి కావాలనే టార్గెట్ చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. ప్రతీసారి తన అన్నయ్యను టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బందులకు గురిచేయాలనుకున్నాడని అన్నారు. మా ఎలక్షన్ ఫలితాల తర్వాత కూడా అతను తగ్గలేదని.. తమకు మద్దతు తెలిపినవారందరినీ వయసుతో సంబంధం లేకుండా నానా మాటలు అన్నాడని పేర్కొన్నారు. ఇదే విషయంపై తన తండ్రితో మాట్లాడగా.. జీవితంలో అతనికి ఎలాంటి లక్ష్యం లేదని.. అందుకే అలా ప్రవర్తిస్తున్నాడని చెప్పాడన్నారు. నాన్న చెప్పిన మాటలు నిజమే అనిపించిందన్నారు.
తనకు తెలిసినంతవరకు సినీ ఇండస్ట్రీలో అందరి మధ్య మంచి అనుబంధం ఉందని.. కానీ ఆ ఒక్క వ్యక్తి మాత్రమే తన సోదరుడు విష్ణుని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకున్నాడని మంచు మనోజ్ అన్నారు. జీవితంలో ప్రతీ ఒక్కరూ ఉన్నత స్థాయి విలువలు కలిగి ఉండాలని... జీవిత లక్ష్యం కంటే కూడా అది ఎంతో గొప్పదని అభిప్రాయపడ్డారు. అది లేని వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడని.. పక్కవాళ్లను కూడా ఇబ్బందులకు గురిచేస్తాడని పేర్కొన్నారు.
Also Read: China Flight Crash: చైనా విమాన ప్రమాదంలో ఎవరూ బతకలేదా..కొండపై చెలరేగుతున్న మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook