Will Smith in Oscars 2022: ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సంలో విల్​ స్మీత్​.. స్టేజ్​పైనే క్రిస్​ రాక్​ చెంప చెల్లుమనిపించిన ఘటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న నేపథ్యంలో 'ది అకాడమి ఆఫ్​ మోషన్​ పిక్చర్​ ఆర్ట్స్ అండ్ సైన్స్​ (ఏఎంపీఏఎస్​)' స్పందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఏ విధమైన హింసను అకాడమీ సహించదు. ఈ రాత్రి 94వ అవార్డుల వేడుక జరుపుకుంది. సహచరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల నుంచి గుర్తింపు పొందటం మంచి విషయం' అని చెప్పుకొచ్చింది. అయితే విల్​ స్మిత్ అలా ప్రవర్తించడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అనే విషయంపై మాత్రం అకాడమీ స్పష్టతనివ్వలేదు.


ఇంతకీ విల్​ స్మీత్ ఎందుకలా చేశాడు?


94వ ఆస్కార్ వేడుకల్లో విల్​ స్మిత్ ఉత్తమ నటుడిగా.. ఆస్కార్ గెలుపొందారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో స్టేజ్​పై హాలీవుడ్​ కమేడియన్ క్రిస్​ రాక్​ మాట్లాడుతూ.. విల్​ స్మీత్​ భార్యపై జోకు వేశారు. దీనితో అది నచ్చని విల్​ స్మిత్ స్టేజ్​పైకి ఎక్కి.. క్రిస్​ రాక్​ చెంప చెల్లుమనిపించారు. ఆ తర్వాత ఒక్క క్షణం మౌనంగా ఉన్న క్రిస్​ రాక్​ తిరిగి మాటల్లో మునిగిపోయాడు. విల్​ స్మిత్​తో స్టేజ్​పై నుంచే మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. విల్ స్మీత్​ స్టేజ్​ కింద నుంచి కూడా క్రిస్​ రాక్ మాటలకు కోపంగానే సమాధానిమచ్చారు.



అయితే ఆ తర్వాత విల్​ స్మిత్​ క్రిస్​ రాక్​కు, అకాడమికీ క్షమాపణలు కూడా చెప్పారు.


ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. విల్​ స్మిత్ అలా చేయకుండా ఉండాల్సిందని కొందరు కామెంట్స్ చేస్తుంటగా.. విల్​ స్మిత్ మంచి పని చేశాడండూ పలువురు సపోర్ట్ చేస్తున్నారు.


Also read: Radhe Shyam OTT: 'రాధేశ్యామ్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. అమెజాన్‌ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్‌!


Also read: Krishna Vrinda Vihari: 'కృష్ణ వ్రి౦ద విహారి' సినిమా టీజర్ విడుదల.. ఎలా ఉందంటే..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook