The Warriorr: ఉప్పెన భారీ విజయంతో కన్నడ అందాల నటి కృతిశెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. రామ్ పోతినేని సరసన విజిల్ మహాలక్ష్మిగా దర్శనమివ్వనుంది ఈసారి. ఆ వివరాలు చూద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ హిట్ మూవీ, సుకుమార్ శిష్యుడు తెరకెక్కించిన ఉప్పెన మూవీ భారీ విజయం సాధించింది. కరోనా కారణంగా ఇబ్బందులెదుర్కొంటున్న చిత్ర పరిశ్రమకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది ఈ సినిమా. అదే సమయంలో ఈ సినిమాతో తెలుగు తెరకు తొలిసారిగా పరిచయమైన కన్నడ టీనేజ్ గర్ల్ కృతిశెట్టికి వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అంతేకాదు..యూత్‌లో క్రేజ్ బాగా పెరిగిపోయింది ఈ అమ్మడికి. 


ఇప్పుడు రామ్ పోతినేని సరసన మరో మంచి సినిమాలో నటించనుంది. ఎన్ లింగుసామి తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ది వారియర్‌లో విజిల్ మహాలక్ష్మిగా దర్శనమివ్వనుంది కృతిశెట్టి. ఈ సినిమా రామ్‌కు తొలి ద్విభాషా చిత్రం కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతోంది. అంటే కృతిశెట్టి ఇక తమిళంలో కూడా క్రేజ్ మూటగట్టుకోనుంది. ఇవాళ వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. సినిమా ఫస్ట్‌లుక్ కృతిశెట్టిదే కావడం విశేషం. ఇందులో షర్ట్ , జీన్స్ ధరించి స్కూటర్ నడుపుతూ కన్పిస్తుంది. సినిమాలో కృతిశెట్టి (Krithi shetty)పాత్ర విజిల్ మహాలక్ష్మి అని పోస్టర్ ద్వారా దర్శక నిర్మాతలు చెప్పకనే చెప్పారు. ది వారియర్ ఫస్ట్‌లుక్ (The Warriorr First Look) సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండగా..దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ బడ్జెట్ పెడుతున్నారు. 


Also read: Rakhi Sawant Divorce: సినీ ఇండస్ట్రీలో విడాకుల కలవరం.. భర్తతో విడిపోయిన మరో నటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook