28 Guests for The Warriorr Movie Tamil Pre Release Event: 'రెడ్' సినిమాతో భారీ పరాజయం ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ కోసం అయన తమిళ డైరెక్టర్‌ లింగుస్వామితో జతకట్టాడు. రామ్, లింగుస్వామి కాంబోలో తెరకెక్కిన సినిమా 'ది వారియర్‌'. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి నటించారు. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ది వారియర్‌ సినిమా విడుదల కాబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ది వారియర్‌ నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తెలుగు వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 10న జరగనుండగా.. నేడు త‌మిళ వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ప్రారంభం అయింది. ఈ ఈవెంట్‌కు త‌మిళ ఇండ‌స్ట్రీ నుంచి 28 మంది సెల‌బ్రిటీలు ముఖ్య అతిథులుగా వస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్లు, హీరో, హీరోయిన్స్ వస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 


డైరెక్ట‌ర్లు భార‌తీరాజా, శంక‌ర్‌, మ‌ణిర‌త్నం, గౌత‌మ్ మీన‌న్, ఎస్‌జే సూర్య‌, విట్రిమార‌న్, లోకేశ్ క‌న‌గ‌రాజ్, హెచ్ వినోథ్‌, కార్తీక్ సుబ్బ‌రాజు, పీఎస్ మిత్ర‌న్‌, శ‌శి, విక్ర‌మ్ ఫ్రభు, పార్థీబ‌న్‌, శివ‌.. హీరోలు కార్తీ, విశాల్‌.. హీరోయిన్ కీర్తి సురేశ్‌తో పాటు ప‌లువురు నటీన‌టులు ముఖ్య అతిథులుగా వస్తున్నారట. ఇంతమంది చీఫ్ గెస్టులు రాకతో ది వారియర్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నుల పండగ కానుంది. ఇప్పటికే  ఫాన్స్ కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. 


ది వారియర్‌ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 10న హైద‌రాబాద్‌లోని జేఆర్సీ క‌న్వెన్ష‌న్‌లో జ‌రుగ‌నుంది. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్టులు భారీగానే రానున్నారని సమాచారం. ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి ది వారియ‌ర్‌ను నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్  మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్‌గా రామ్ నటిస్తున్నాడు. సినీ అభిమానుల్లో ది వారియర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 


Also Read: Joe Root Record: విరాట్ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌లను దాటేసిన జో రూట్.. సచిన్‌ రికార్డు కష్టమేమీ కాదు!  


Also Read: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ షో..నిరాశ పర్చిన విరాట్ కోహ్లీ..! 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook