Theppa Samudram: ఈ మధ్యకాలంలో బిగ్‌బాస్ షోతో పాపులర్ అయినవాళ్లు సినిమాల్లో తమ లక్‌ను పరీక్షించుకుంటున్నారు. ఈ కోవలో బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి ప్రధాన పాత్రలో చైతన్య రావు మరో హీరోగా కిషోరి దాత్రక్ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'తెప్ప సముద్రం'. ఈ చిత్రానికి పి.ఆర్. సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 12న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రం నుండి పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ MRT మ్యూజిక్ ద్వారా విడుదల చేసారు. కొంతమంది మృగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో వారికోసం కుటుంబం పడుతున్న బాధలు, రోదనలు ఈపాటలో హార్ట్ టచింగ్‌గా చూపించారు. పాట మొత్తం  చాలా ఎమోషనల్ గా సాగింది.ఈ సందర్భంగా నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ...దర్శకుడు సతీష్ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. సినిమా అవుట్ ఫుట్ చూసాను. చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ... తెప్ప సముద్రం చిత్రం చాలా బాగా వచ్చింది. మా నిర్మాత రాఘవేందర్ గారు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని ఖర్చకు వెనకాడకుండా నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకులు నచ్చే మంచి కమర్షియల్ చిత్రం అవుతుంది"అన్నారు




నటీనటులు: చైతన్య రావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్


టెక్నికల్ టీం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ రాపోలు
నిర్మాత: నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్
బ్యానర్:  శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: : పి.ఆర్
 డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లి
ఎడిటర్: సాయిబాబు తలారి


Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook