Telugu Born Actresses: ఈ పాతిక మంది స్టార్ హీరోయిన్లు తెలుగు వారే అని తెలుసా.. ఎక్కడ పుట్టారంటే?
25 Star Actresses are Telugu Native: తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి అంత ఆదరణ లభించదు అని అందరూ అనుకుంటారు కానీ దాదాపుగా 25 మంది హీరోయిన్లు తెలుగు బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు సత్తా చాటారు.
These 25 Heroines are from Telugu States: ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఇతర భాషల హీరోయిన్లను బాగానే నటింప చేస్తున్నారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి అంత ఆదరణ లభించదు అనేది మొదట నుంచి ఉన్న కంప్లైంటే, అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు దాదాపుగా 25 మంది హీరోయిన్లు వచ్చి మంచి క్రేజ్ దక్కించుకుని స్టార్లుగా వెలుగొందిన వారు ఉన్నారు, అలాంటివారు ఎవరెవరు? వారు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి చెందినవారు? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా మహానటి సావిత్రి గుంటూరు దగ్గరలోని చిర్రావూరు అనే గ్రామంలో జన్మించారు. ఇక కేవలం నటిగానే కాదు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ ప్రొడ్యూసర్ ఇలా అనేక టాలెంట్స్ కలిగి ఉన్న భానుమతి ప్రకాశం జిల్లా దొడ్డవరం అనే గ్రామంలో జన్మించారు. ఇక అలనాటి నటి కాంచన విజయవాడలో జన్మిస్తే కన్నాంబ విజయవాడ రూరల్ లో జన్మించారని అంటూ ఉంటారు. ఇక కృష్ణకుమారి అనే నటి పుట్టింది వెస్ట్ బెంగాల్లో అయినా ఆమె కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రాంతానికి చెందినవారు. ఇక జమున గుంటూరు జిల్లా దుగ్గిరాలలోనే పుట్టి పెరిగారు.
Also Read: Ravanasura OTT Release: రావణాసుర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ఇక నటి వాణిశ్రీ నెల్లూరులో పుట్టి పెరిగారు. అంజలీదేవి పెద్దాపురంలో పుట్టి అక్కడే పెరిగి సినీ నటిగా మారారు. జయప్రద రాజమండ్రిలో పుట్టారు, జయసుధ నిడదవోలులో పుట్టారు. భానుప్రియ రాజమండ్రి దగ్గరలోనే రంగంపేటలో జన్మించారు. ఇక నటి రోజా తిరుపతి దగ్గర ఒక పల్లెటూరులో జన్మించారు. రంభ విజయవాడలో జన్మించారు ఆమని బెంగుళూరులో సెటిలైన ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది. విజయశాంతి చెన్నైలో సెటిల్ అయిన రామగుండం ప్రాంతానికి చెందిన ఒక కుటుంబంలో జన్మించింది.. రాశి కూడా తెలుగమ్మాయి. హీరోయిన్ లయ కూడా విజయవాడలోనే పుట్టి పెరిగింది. హీరోయిన్ ప్రత్యూష నల్గొండ జిల్లా భువనగిరిలో పుట్టి పెరిగింది.
నటి అర్చన కూడా తెలుగువారింట జన్మించిన అమ్మాయే. ఇక హీరోయిన్ అంజలి రాజమండ్రిలో పుడితే కలర్స్ స్వాతి కూడా తెలుగు రాష్ట్రాల్లోనే జన్మించింది. ఇక బిందు మాధవి చిత్తూరు జిల్లాకు చెందిన అమ్మాయి. ఈషా రెబ్బా హైదరాబాదులోనే తన చదువు అంతా పూర్తి చేసుకుంది. రీతు వర్మ కూడా హైదరాబాదుకు చెందిన ఒక కుటుంబంలో జన్మించిన తెలుగు అమ్మాయి. తెలుగు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ ని ఏలిన రేఖ కూడా తెలుగమ్మాయే. ఇక వీరు కాకుండా తెలుగులో హీరోయిన్లు అర్చన, శ్రీవిద్య, పునర్నవి సహా అనేక మంది అమ్మాయిలు హీరోయిన్లుగా మారే ప్రయత్నంలో ఉన్నారు. చూడాలి వీరిలో ఎంతమంది సక్సెస్ అవుతారు అనేది.
Also Read: Allu arjun Top 10 Movies: అల్లు అర్జున్ టాప్ టెన్ మూవీస్ ఇవే.. కల్ట్ స్టేటస్ సాధించిన సినిమా ఏదంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook