Bigg Boss 7 Telugu: ఇవాళే బిగ్‌బాస్ సీజన్ 7 స్టార్ట్.. హౌస్ లోకి వెళ్లినవారు వీరే..!
Bigg Boss 7 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మరికొన్ని గంటల్లో స్టార్ట్ కానుంది. ఈ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహారించనున్నారు.
Bigg Boss 7 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7(Bigg Boss 7 Telugu) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. నేటి సాయంత్రం 07 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 మెుదలుకానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహారించనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రోమోల సీజన్ 07పై ఆసక్తిని పెంచేశాయి. ముందు సీజన్ లతో పోలిస్తే.. సీజన్ 07లో భారీగానే మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీకెండ్ ఎపిసోడ్స్ ను నేరుగా సెట్ లోనే కూర్చుని లైవ్ లో చూసే అవకాశం వీక్షకులకు కల్పించనున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.
మరి ఈ సారి హౌస్ లోకి ఎవరు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొంత మంది పేర్లు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ లిస్ట్ లో మోడల్స్, సీరియల్ నటీనటులు, యూట్యూబర్స్, సింగర్స్ ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, కొంత మంది కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసి హౌస్ లోకి పంపించారట. ఈసారి హౌస్ లో మొత్తం 20 మంది ఉన్నబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. చివరి నిమిషంలో కొంత మంది కంటెస్టెంట్స్ డ్రాప్అయినట్లు కూడా తెలుస్తోంది.
హౌస్ లోకి వెళ్లినవారు
1. సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి
2. సీరియల్ నటి శుభ శ్రీ
3. సీరియల్ నటి ప్రియాంక జైన్.
4. సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే.
5. కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి
6. మోడల్ ప్రిన్స్ యవర్ (నా పేరు మీనాక్షి ఫేమ్)
7. ఆట సందీప్
8. ఒకప్పటి హీరో శివాజీ
9. ఒకప్పటి హీరోయిన్ ఫర్జానా
10. షకీలా
11. నటుడు గౌతమ్ కృష్ణ (ఆకాశవీధిలో ఫేమ్)
12. జబర్దస్త్ నటుడు యూట్యూబ్ ఫేం తేజ. (టేస్టీ తేజ)
13. మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి.
14. పల్లవి ప్రశాంత్ (కామన్ మాన్)
హౌస్‌లోకి వెళ్లబోయే వారు..
16. సింగర్ దామినీ.
17. హీరోయిన్ రితిక నాయక్
18. ప్రభాకర్
19. మహేష్ ఆచంట
20. అర్జున్ అంబటి
21. ప్రభాకర్
22. అంజలి పవన్
Also Read: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఛాన్స్.. ఇలా చేస్తే లైవ్ లో షో చూడొచ్చు..!
షో నుంచి తప్పుకున్న వారు: జబర్దస్త్ నరేష్, మొగలి రేకులు ఫేం సాగర్, యాంకర్ నిఖిల్, పూజా మూర్తి, యువ సామ్రాట్, అనిల్ గీలా, అన్షూరెడ్డి, మోహన భోగరాజు.
Also Read: R S Shivaji: కోలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి