Surveen Chawla Opens up About her Casting Couch Experience: గతకొంత కాలంగా 'కాస్టింగ్ కౌచ్‌' (Casting Couch) సినిమా ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా.. పలువురు హీరోయిన్‌, నటీమణులు కాస్టింగ్ కౌచ్‌పై తమ అనుభవాలను పంచుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు సినీ పరిశ్రమలో తమకు ఎదురైన సంఘటనల గురించి చెపుతన్నారు. ఈ క్రమంలో గతంలోనే కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుర్వీన్ చావ్లా (Surveen Chawla) మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురయిందని చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'డీ కపుల్‌డ్' అనే వెబ్ సిరీస్‌లో ఆర్ మాధవన్ సరసన సుర్వీన్ చావ్లా (Surveen Chawla) నటించారు. ఈ  వెబ్ సిరీస్‌ ప్రమోషన్లల్లో భాగంగా తాజాగా రేడియో-హోస్ట్ సిద్ధార్థ్ కానన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ సినిమా మీటింగ్‌లో మీ బరువు 56 కిలోలు అని హెచ్చరించిన ఘటన ఉందట కదా?, అది నిజమేనా అని అడగ్గా... 'అవును నిజమే. నేను టెలివిజన్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నేను ఒక దక్షిణాది సినిమా కోసం ముంబైలో ఆడిషన్ ఇచ్చాను. ఆ సమయంలో నా బరువు, నడుం చుట్టుకొలత, ఎదభాగాల కొలతలు.. (Waist and Chest Size) ఇలా  శరీరంలోని అన్ని భాగాలపై ప్రశ్నించారు. ఈ ఇండస్ట్రీలోకి ప్రవేశించాలంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి' అని సుర్వీన్ చెప్పారు. 


Also Read: Trolls on Sourav Ganguly: సౌరవ్ గంగూలీ మంచి బ్యాటర్, కెప్టెన్ మాత్రమే కాదు.. అంతకుమించి అబద్ధాలకోరు కూడా!!


'సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి మహిళలకు ఇలానే జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణాది సినిమా పరిశ్రమలో. ఇక్కడ కొనసాగాలంటే కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే అవి సరైనవి కావని నా ఉద్దేశం. సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని ఏళ్లుగా పరిస్థితులు మారాయి. బాడీ షేమింగ్, మెంటల్ హెల్త్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక మహిళ భవిష్యత్తును శరీర చుట్టు కొలతలతో నిర్ణయించడం సమంజసం కాదు అని నేను అనుకుంటున్నా' అని సుర్వీన్ చావ్లా (Surveen Chawla) పేర్కొన్నారు. క‌న్న‌డ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన  ఉత్త‌రాది భామ సుర్వీన్ చావ్లా.. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, పంజాబీ చిత్రాల‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. తెలుగులో శర్వానంద్ హీరోగా వచ్చిన 'రాజు మ‌హ‌రాజు' చిత్రంలో నటించారు. 


Also Read: APSRTC bus accident: ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ సీఎం


సుర్వీన్ చావ్లా (Surveen Chawla) 2015లో పెళ్లి చేసుకున్నా.. 2017వరకు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ విషయంపై సుర్వీన్ స్పందిస్తూ... 'నా భర్తకు మీడియా అంటే చాలా భయం. అందుకే పెళ్లి విషయం ఎవరికీ చెప్పలేదు. పెళ్లి విషయం మీడియాకు వెల్లడించకూడదని ఇద్దరం నిర్ణయించుకున్నాం. మా పెళ్లి 40 మంది సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. ఎలాగూ తెలిసింది కదా' అని అన్నారు. సుర్వీన్ చావ్లాకు అగ్లీ (2013), హేట్ స్టోరీ-2 (2014), పార్చ్‌డ్ (2015) సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి. కసౌతి జిందగీ కే, కహిన్ తో హోగా మరియు కజ్జల్ వంటి టీవీ షోలు.. వెబ్ సిరీస్ సేక్రేడ్ గేమ్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి