Puri Jagannadh: `పూరీ జగన్నాధ్`ను డబ్బు వెనక్కడిగే హక్కుందా?
Puri Jagannadh Hand on Liger losses: పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేశాడు. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు నష్టాల అంశం హాట్ టాపిక్ అవుతోంది.
Puri Jagannadh Liger losses: చాలా కాలం పాటు సరైన హిట్ సినిమా లేక ఇబ్బందులు పడిన పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో మరోసారి లైన్ లోకి వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేశాడు పూరీ జగన్నాథ్. చార్మికౌర్ నిర్మాతగా ప్రారంభమైన ఈ సినిమాలోకి అనూహ్యంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఎంట్రీ ఇచ్చాడు, ఆ తర్వాత ఈ సినిమాలో ఆయన కంపెనీ నుంచి వచ్చిన అనన్య పాండే హీరోయిన్ గా ఎంపిక అయింది.
2022 వ సంవత్సరంలో అత్యంత ఆసక్తికరమైన కాంబినేషన్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. భారీ అంచనాలతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఆసక్తికరంగా డిస్ట్రిబ్యూటర్లు పూరీ జగన్నాథ్ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండడం చర్చనీయాంశం అవుతుంది. నిజానికి ఈ సినిమా హక్కులు మొత్తం వరంగల్ శ్రీను అనే వ్యక్తి కొనుక్కున్నాడు. అతని దగ్గర చాలామంది ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు జిల్లాల వారీగా హక్కుల కొనుక్కున్నారు.
Also Read: Shraddha Das Photos: తళుకుబెళుకుల డ్రెస్సులో కైపెక్కిస్తున్న శ్రద్దా దాస్
గతంలోనే తమకు డబ్బులు రిటర్న్ చేయాలి అనే డిమాండ్తో కొంతమంది విషయంలో నిరాహారదీక్షకు సిద్ధమవుగా పూరి జగన్నాథ్ అప్పట్లో వారిని వారించాడు. దీంతో వారు అప్పుడు ఆగి పోయారు. ఈ వ్యవహారం జరిగి ఆరు నెలలు అవుతున్నా క్రమంలో మరోసారి వారంతా నిరసనకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూరి జగన్నాథ్ తన ఫోన్లు ఎత్తడం మానేశాడు కాబట్టి తాను థియేటర్ ఓనర్లకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే నిజంగా పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఎందుకంటే లైగర్ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా హక్కులు భారీ ఎత్తున అమ్ముడుపోయాయి. సౌత్ ఇండియా మొత్తానికి 65 కోట్ల రూపాయల మేర వరంగల్ శ్రీను డీల్ క్లోజ్ చేసుకున్నాడు. అది కూడా నాన్ రిఫండెబుల్ అడ్వాన్స్ పద్ధతిలో. ఈ క్రమంలో లీగల్ గా అయితే వెనక్కి రూపాయి కూడా పూరి జగన్నాథ్ గాని నిర్మాతలు గాని చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి తోడు వరంగల్ శీను 65 కోట్లకు మాట్లాడుకున్నా కరోనా తర్వాత మార్కెట్ తగ్గిందని చెబుతూ 10 కోట్లు తక్కువగానే చెల్లించాడు. ఒకవేళ లాభం వచ్చి ఉంటే పూరి జగన్నాథ్ కి చెల్లించేవాడో లేదో తెలియదు. కానీ ఇప్పుడు నష్టం వచ్చింది కాబట్టి ఒక నష్టాలు తీర్చాలని వారు కోరడం ఏమాత్రం సభము కాదని అంటున్నారు విశ్లేషకులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి