Thimmarusu Movie trailer launch: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన తిమ్మరుసు మూవీ ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైంది. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశాడు. సత్య దేవ్ లాయర్ పాత్రలో నటించాడు. నటుడు అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. తిమ్మరుసు ట్రైలర్ లాంచ్ సందర్భంగా సినిమా గురించి తారక్ (Tarak) మాట్లాడుతూ.. సత్యదేవ్ నటన, సినిమా కథ అద్భుతంగా ఉందని అభినందించాడు. సినిమా విడుదలై సూపర్ హిట్ సాధించాలని కోరుకుంటున్నట్లు తారక్ పేర్కొన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Nora Fatehi viral dance video: నారా ఫతేహి డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే


మంగళవారం రాత్రి 7 గంటలకు జరగనున్న తిమ్మరుసు మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని (Nani) ముఖ్య అతిధిగా హాజరుకానున్నాడు. తిమ్మరుసు సినిమాను జూలై 30న థియేటర్స్‌లోనే విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 


తిమ్మరుసు సినిమా (Thimmarusu movie) విడుదల తర్వాత లాక్డ్ 2 వెబ్ సిరీస్‌తో పాటు గాడ్సే, స్కైలాబ్, గుర్తుందా శీతాకాలం వంటి సినిమాల్లో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. అంతేకాకుండా ఫేమస్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మాతగా నిర్మించనున్న మరో సినిమాలోనూ సత్యదేవ్ హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రాలు అన్నింటికి అవసరమైన బూస్టింగ్ తిమ్మరుసు మూవీ ఇస్తుందని సత్యదేవ్ (Satyadev) ఆశిస్తున్నాడు.


Also read : రాజ్ కుంద్రా అరెస్ట్: Gehana vasisth photos gallery వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook