Actress childhood pics: చివరిగా మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేసిన విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.  దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరిపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఏకంగా పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్నట్లు సమాచారం. ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వచ్చే ఏడాది సెట్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ఇకపోతే ఈ సినిమా గురించి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. జనవరి నుంచి మహేష్ బాబు రాజమౌళి మూవీ మొదలవుతుంది అంటూ హింట్ ఇచ్చారు. ఇప్పటికే మహేష్ బాబు తన పాత్ర కోసం తన మేకోవర్ ను  కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఇప్పటికే మహేష్ బాబు లుక్కు.. కూడా చాలా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. 



ఇదిలా ఉండగా.. మహేష్ బాబు,  సాక్షి శివానంద , సిమ్రాన్ కలిసిన నటించిన చిత్రం.. యువరాజు. ఈ చిత్రం నుండి ఒక ఫోటో ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. అందులో మహేష్ బాబు ఒక అమ్మాయిని ఎత్తుకొని ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతుంది.  ఆ సినిమాలో ఈ అమ్మాయి ఎంత షార్ప్ గా నటించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయిల కలల  రాకుమారి అంటే ఎవరైనా నమ్మగలరా..?


ఆ అమ్మాయికి ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.  కుర్రాల హాట్ ఫేవరెట్ కూడా. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ మెప్పించిన ఈమె ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు అందాల భామ శ్రీదివ్య. తమిళ్లో కూడా నటించి మెప్పించింది.  తన తెలుగులో కేరింత సినిమాతో క్రేజ్ దక్కించుకున్న ఈమె కార్తీక్, విశాల్, శివ కార్తికేయన్ వంటి హీరోల సరసన నటించింది. ఇక ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 




 


Read more: Mutyalamma Temple: ముత్యాలమ్మ విగ్రహాం ధ్వంసం.. రంగంలోకి దిగిన రాజాసింగ్.. సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి