OTT Releases: ఈ దీపావళికి విడుదలైన అమరన్, క, లక్కీ భాస్కర్ చిత్రాలు భారీ విజయం నమోదు చేస్తే ఇటీవల వచ్చిన మట్కా ఘోరంగా నిరాశపర్చింది. సూర్య నటించిన కంగువా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇటీవలి కాలంలో చిన్న బడ్జెట్ సినిమాలు అధికమయ్యాయి. అలాంటి కొన్ని సినిమాలు ఇటు థియేటర్ అటు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. ఆ జాబితా ఓసారి చెక్ చేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి నటించిన మెకానిక్ రాకీ నవంబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో సునీల్, నరేశ్ కూడా ముఖ్యపాత్రలో కన్పించనున్నారు. అశోక్ గల్లా నటింిన దేవకీ నందన వాసుదేవ సినిమాకు దర్శకుడు ప్రశాంత వర్మ కథ అందించగా అర్జున జంధ్యాల తెరకెక్కించారు. ఇది కూడా నవంబర్ 22నే విడుదల కానుంది. జబర్దస్ట్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ నటించిన కేశవ చంద్ర రమావత్ నవంబర్ 22న విడుదలవుతోంది. ఇక సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన మందిర సినిమా కూడా నవంబర్ 22న విడుదలవుతోంది. ఇక హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ నటించిన నవంబర్ 22న విడుదల కానుంది. 


నెట్‌ఫ్లిక్స్‌లో..


నయనతార నటించిన బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 18న వాండరూస్ 2 యానిమేషన్ వెబ్‌సిరీస్, నవంబర్ 19 జాంబీ వర్స్ కొరియన్ వెబ్‌సిరీస్, నవంబర్ 22న జాయ్ హాలీవుడ్ సినిమా, పోకెమాన్ హారిజాన్స్ ది సిరీస్ 4, స్పెల్ బౌండ్ యానిమేషన్ సిరీస్, ది పియానో లెసన్ హాలీవుడ్ సినిమా, యే కాలీ కాలీ ఆంఖే స్ట్రీమింగ్ కానున్నాయి.


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో...


నవంబర్ 19న ఇంటీరియర్ చైనా టౌన్ వెబ్‌సిరీస్, కిష్కింధ కాండమ్ తెలుగు వెబ్‌సిరీస్, నవంబర్ 21న ఏలియన్ రొమ్యులస్ హాలీవుడ్ సినిమా, నవంబర్ 22న అవుట్ ఆఫ్ మై మైండ్ హాలీవుడ్ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి.


అమెజాన్ ప్రైమ్‌లో..


నవంబర్ 20న క్యాంపస్ బీట్స్ 2 హిందీ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. 


జియో సినిమాలో


నవంబర్ 17 నుంచి బ్యాక్ టు బ్లాక్ హాలీవుడ్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 18 నుంచి డ్యూన్ ప్రోఫెసి వెబ్‌సిరీస్, నవంబర్ 23 నుంచి హరోల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ హాలీవుడ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 


Also read: Air Pollution: విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు నిరవధిక సెలవు, ఎందుకంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.