This Weekend Tollywood Releases: సాధారణంగా సినిమాలకు సంక్రాంతి తరువాత సమ్మర్ సీజన్ బాగా వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లకు సమ్మర్ సీజన్లోనే లాభాలు వచ్చి పడతాయని కూడా ట్రేడ్ వర్గాల వారు భావిస్తూ ఉంటారు. కానీ ప్రతి ఏడాది సంగతి తెలియదు కానీ ఈ ఏడాది సమ్మర్ సీజన్ మాత్రం వారికి ఏ మాత్రం లాభాలు తెచ్చి పెట్టలేదు సరి కదా నష్టాల్లోకి నెట్టేసేలా ఉందని అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యకాలంలో సమ్మర్ లో విడుదలైన సినిమాలలో కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు కొంతవరకు నచ్చాయి. వాటిలో కూడా దియేటర్లకు వెళ్లి చూసే అంత పెద్ద హీరోలు కానీ హీరోయిన్లు కానీ స్టార్ అట్రాక్షన్ కానీ లేకపోవడంతో థియేటర్లకు వచ్చి చూసే వాళ్ళు చాలా తక్కువయ్యాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సమ్మర్ పరిశీలిస్తే ప్రతి వీకెండ్ కి అరడజనుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా సరే మినిమమ్ సంఖ్యలో కూడా ప్రేక్షకులను దియేటర్లకు రాబట్టుకోలేకపోతున్నాయి.


Also Read: Shruti Reddy Photos: పొట్టి గౌనులో కాక రేపేస్తున్న శృతి రెడ్డి.. వామ్మో?


అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఈ వారం కూడా రిలీజ్ అయిన సినిమాలు ఏవి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకోలేకపోయాయి మరీ ముఖ్యంగా ఈ వారం డైరెక్టర్ తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా హింస అనే సినిమా రిలీజ్ అయింది. కానీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.


బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్ సినిమా, మధుసూద ఫేమ్ తిరువీర్ పరేషాన్ సినిమా కూడా ఈ వారం విడుదలయ్యాయి. కానీ ఏమాత్రం వర్కౌట్ అవలేదు. ఇక కాస్త ప్రమోషన్స్ లో కనిపించి వినిపించిన పేర్లు ఇవి కాగా మరో రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ అవి రిలీజ్ అయిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. మరీ ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో విడుదలైన దసరా, బలగం, విరూపాక్ష మాత్రమే కాస్త లాభాలు తెచ్చిపెట్టాయని మిగతా సినిమాలన్నీ తమకు ఇబ్బందికరంగా మారాయని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు.  


Also Read: Tamannaah Bhatia Photos: పొట్టి బట్టల్లో రచ్చ రేపుతున్న తమన్నా భాటియా.. ఫొటోలు చూశారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK