Varun Tej Upcoming Movie: సంవత్సరానికి ఒక సినిమాతో కనిపిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 2022లో విడుదలైన ఎఫ్ 3 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాతో హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత 2023లో విడుదలైన గాంధీవధారి అర్జున, 2024 లో ఈ మధ్యనే విడుదలైన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలతో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు వరుణ్ తేజ్ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా మట్కా పైనే పెట్టుకున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన మూడవ షెడ్యూల్ మొదలు కాబోతోంది. వింటేజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ తన లుక్కుని పూర్తిగా మార్చేయబోతున్నారు. సినిమాలో తన పాత్ర కోసం జుట్టు తో పాటు గడ్డం కూడా పెంచుతున్నారు.


ప్రముఖ డైరెక్టర్ కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హీరోయిన్లకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.


ఇక ఈ సినిమాలో నోరా ఫతేహి కూడా కీలకపాత్రలో కనిపించనుంది అని కొందరు చెబుతున్నారు. మొదట ఈమె ఐటెం సాంగ్ లో మాత్రమే కనిపిస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ చూస్తూ ఉంటే సినిమాలో కూడా ఈమెకి ఒక పెద్ద పాత్ర దొరికినట్లు తెలుస్తోంది.
 
తన పాత్ర షూటింగ్ కోసం నోరా ఫతేహి ఏకంగా 36 రోజులపాటు కాల్ షీట్ లు ఇచ్చిందట. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మర్యాద రామన్న ఫేమ్ సలోని కూడా ఈ సినిమాలో మరొక కీలక పాత్రలో కనిపించబోతోంది అని వార్తల వినిపిస్తున్నాయి. అయితే ఈమె వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేయడం కాకుండా ఈ సినిమాలో ఆమె పాత్ర కథలోని ఒక పొలిటికల్ యాంగిల్ ను తీసుకొస్తుందట. మరి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎంత వరకు హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.


Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు


Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter