Kalki 2898 AD Review: సౌత్ లోకనాయకుడు కమల్ హాసన్, నార్త్ లో బిగ్-బి అమితాబ్ బచ్చన్.. ఇద్దరూ సూపర్ స్టార్లే. వీళ్లిద్దరూ కలిసి ఇప్పుడు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాలో.. అమితాబ్ బచ్చన్.. అశ్వద్ధాముడి పాత్రలో కనిపించనుండగా.. కమల్ హాసన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇద్దరు సూపర్ స్టార్లు వెండి ధర మీద కనిపించడం ఇది మొదటిసారి కాదు. 1985లో గిరఫ్తార్ అనే హిందీ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. వీళ్ళిద్దరితోపాటు సౌత్ సూపర్ స్టార్.. రజినీకాంత్ కూడా కీలక పాత్రలో కనిపించారు. అప్పట్లో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం.. కురిపించింది. 


తాజాగా ఇప్పుడు 39 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరు హీరోలని ఒకేసారి వెండి తెర.. మీద చూడాలని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 1985లో గిరఫ్తార్ సినిమా నుంచి వీళ్లిద్దరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. 


 



భారీ అంచనాల మధ్య కల్కి 2898 ఏడి.. సినిమా ఈ గురువారం అన్ని భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. భారీ తారాగణం తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. కచ్చితంగా రికార్డు స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.


దీపికా పడుకొనే ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయంకానుంది. లోఫర్ సినిమా తర్వాత దిశా పటాని.. మళ్లీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మాళవిక నాయర్ విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ రాజమౌళి, రాంగోపాల్ వర్మ మంటి స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించనున్నారు.


Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.