Bala Krishna: టాలీవుడ్ లోని స్టార్ హీరోలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసే క్రమంలో.. తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కాదు. వాళ్లు మొదలుపెట్టే మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి అన్న తాపత్రయంతో.. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్ అలా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారే. ఇదే రకంగా సూపర్ స్టార్ కృష్ణ.. కూడా తన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు. కొడుకు అంటే మహేష్ బాబు కాదండోయ్.. రమేష్ బాబు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబును.. హీరో ఎంట్రీ ఇప్పించడం కోసం అతనికి నటనతో పాటు డాన్స్,ఫైట్స్.. ఇలా అన్ని విద్యలలో శిక్షణ ఇప్పించారు. మరోపక్క చిన్న కొడుకు మహేష్ బాబుని చైల్డ్ ఆక్టర్ గా తనతో పాటు సినిమాల్లో యాక్ట్ చేయించి ట్రైనింగ్ ఇచ్చుకున్నారు. రమేష్ బాబు ఎంట్రీ కోసం.. అప్పట్లో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన భేతాబ్ అనే మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నారు.. 


పరుచూరి బ్రదర్స్ తో ఈ సినిమాకు సంబంధించిన రచన చేయించి.. బాలీవుడ్ బప్పిలహిరి తో పాటను రికార్డ్ చేయించారు. రమేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనమ్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. కొడుకు మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో.. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మించాలి అని సొంతంగా పద్మాలయ స్టూడియో బ్యానర్స్ పైన.. ఈ సినిమాని ప్రారంభించారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన కొడుకు సామ్రాట్ గా వెలగాలి అనే ఉద్దేశంతో మూవీకి సామ్రాట్ అనే సూపర్ హైప్ ఉన్న టైటిల్ ని కూడా సెలెక్ట్ చేశారు.


అదే టైంలో బాలకృష్ణ హీరోగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు. దేవుడు చేసిన మనుషులు సినిమా టైం లో కృష్ణ, రామారావు మధ్య ఒక విషయంలో చిన్నపాటి వివాదం ఏర్పడింది. ఇక అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య అస్సలు మాటలు లేవు అన్న విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా అదే సమయానికి బాలకృష్ణ, విజయశాంతి జంటగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరొక సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఆ మూవీకి కూడా సామ్రాట్ అనే పేరు పెట్టడంతో వివాదం మొదలైంది. 


నిర్మాతలు ఇద్దరూ ఆ టైటిల్ తమదంటే తమది అని వాదించుకున్నారు. ఆఖరికి ఈ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి టైటిల్ హక్కులు కృష్ణకే చెందుతాయని తీర్పునిచ్చారు. దీంతో బాలకృష్ణ సినిమాకు సాహస సామ్రాట్ గా పేరు మార్చుకున్నారు. బాలకృష్ణ సినిమా 1987 ఏప్రిల్ 13న రిలీజ్ అయితే అదే సంవత్సరం రమేష్ బాబు నటించిన సామ్రాట్ చిత్రం అక్టోబర్ 2న విడుదల అయింది. మొదటి సినిమాతో సూపర్ హిట్ సాధించిన రమేష్ బాబు ఓ 15 సినిమాలకు పైగా నటించాడు కానీ ఆ తర్వాత ఏది అతనికి అంత మంచి పేరు తెలియక పోయింది.


Also Read: Mukesh Ambani House Pics: మైండ్ బ్లాక్‌ అయ్యేలా ముఖేష్ అంబానీ ఇల్లు.. ఆ ఫ్లోర్‌లోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..!  


Also Read: Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.