Samantha Bollywood Interview: టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకప్పుడు సమంత కూడా ఒకరు. ఇప్పటికీ కూడా ఆమె ఫ్యాన్ బేస్ లో ఎటువంటి మార్పు లేదు. అయితే గత కొంతకాలంగా మాత్రం సమంతా తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఈమధ్య సమంత తన సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితం పరంగానే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగచైతన్యతో విడాకుల తర్వాత నుంచి సమంత కెరియర్ పడిపోతూ వస్తుంది. అయితే అప్పటినుంచి సమంత చేసిన ప్రతి పని.. మాట్లాడిన ప్రతి మాట వివాదంగా మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే సమంత పాత ఇంటర్వ్యూలో ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతుంది. 


 



బాలీవుడ్ లో ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఫుడ్, సెక్స్ ఈ రెండిట్లో ఏది లేకుండా ఉండగలరు అని ప్రశ్న ఆమెకు ఎదురయింది. దానికి కాసేపు ఆలోచించిన సమంతా "ఫుడ్ లేకుండా ఉండగలను" అని జవాబు ఇచ్చింది. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో మళ్ళీ హల్చల్ చేస్తుంది.


సమంత డేరింగ్ జవాబుకి అభిమానులు మొదట కంగు తిన్నప్పటికీ.. తన మనసులో మాట ను ధైర్యంగా బయటికి చెప్పినందుకు ప్రశంసిస్తున్నారు. ఇక మరోవైపు తెలుగులో సమంత చేతుల్లో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. 


ఈ మధ్యనే తాను స్థాపించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సమంత మా ఇంటి బంగారం అని సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో సమంత పలు వెబ్ సిరీస్ లో నటిస్తోంది. మరి వీటితో ఆమె ఎంతవరకు విజయం అందుకుంటుందో వేచి చూడాలి.


Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్‌ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ


Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter