Tier 2 heroes movies: కరోనా సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూడటం అలవాటు పడిపోయిన ప్రేక్షకులు.. అసలు థియేటర్లకి రావడం మానేశారు అంటూ.. ఈమధ్య చాలామంది కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతవరకు అది నిజమే అయినప్పటికీ.. అన్ని సినిమాల విషయంలోనూ ఇది నిజం కాదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎందుకంటే కథ బావుంటే చిన్న సినిమాలు కూడా నటీనటులతో సంబంధం లేకుండా హిట్ అవుతున్న రోజులు ఇవి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల కెపాసిటీ ఉండి కూడా చాలామంది హీరోలు కథతో సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నారు. పేరుకి వరుసగా సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు కానీ.. ఒక్క సినిమా కూడా హిట్ అవడం లేదు. ఉదాహరణకి ఇండస్ట్రీలో ఉన్న టైర్ 2 హీరోలు అని చెప్పుకోవచ్చు.


మొదటగా చెప్పాల్సింది నాగచైతన్య గురించి. 2021 లో లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య కెరియర్ లో సినిమాలు, హిట్లు రెండు తక్కువే. థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ సినిమాలతో వరుస పరాజయాలు అందుకున్నారు నాగచైతన్య. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ పోతినేని.. తనకి మాస్ ఇమేజ్ బాగా వర్క్ అవుట్ అవుతుందేమో అన్న భ్రమ లో వరుసగా అలాంటి సినిమాలే తీశారు. 


మాస్ ఇమేజ్ కోసమే సినిమాలు తీస్తున్నట్టు రెడ్, ది వారియర్, స్కంద లాంటి సినిమాలు తీశారు. రెడ్ పర్వాలేదు అనిపించినప్పటికీ మిగతా రెండు డిజాస్టర్లు గా నిలిచాయి. దీంతో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అంటూ డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.


మరోవైపు ఒకప్పుడు సెన్సేషనల్ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కూడా ఒకదాని తర్వాత మరొకటి  డిజాస్టర్లు అందుకుంటున్నారు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఇక ఈ మధ్యనే విడుదలైన ది ఫ్యామిలీ స్టార్.. ఇలా విజయ్ హిట్ సినిమాలు కంటే ఫ్లాప్ సినిమాలు ఎక్కువగా తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. చూస్తూ ఉంటే టాలీవుడ్ లో ఉన్న టైర్ 2 హీరోలు ఫ్లాప్ సినిమాలు తీయడంలో నేను అంటే నేను అని పోటీ పడుతున్నట్లు అనిపిస్తోంది. ఒకరికి మించి మరొకరు భారీ ఫ్లాపులు అందుకుంటున్నారు. ఇన్ని పరాజయాలు చూసిన తర్వాత అయినా హీరోలు.. కథ ఉన్న సినిమాలతో ముందుకు వస్తారో లేదో చూడాలి.


Also Read: YS Jagan: తొలిసారి జగన్‌ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి


Also Read: Tirumala Water Problem: తిరుమలలో నీటి సంక్షోభం.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter