Tiger Nageswara Rao OTT: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు ఇవాళ అంటే అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆంధ్రా రాబిన్ హుడ్‌గా పేరు గాంచిన స్టూవర్టుపురం నాగేశ్వరరావు బయోపిక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించాడు. ది కశ్మీర్ పైల్స్, కార్తికేయ 2 వంటి హిట్ చిత్రాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బీజీఎమ్ అదిరిపోయింది. ఈ మూవీలో రవితేజకు జోడిగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో.. టైగర్ నాగేశ్వరరావు డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి నెట్టంట జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ మూవీ తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. అయితే టైగర్ నాగేశ్వరరావు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో 8 వారాలకు స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని టాక్. అయితే ఈ మూవీ క్రిస్మస్‌ కానుకగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. 


Also Read: LEO OTT : దళపతి విజయ్ లియో ఓటిటి స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.