Tillu Square 4 Days Box Office Collections: తెలుగులో ఒప్పుడు  సీక్వెల్స్ అంత‌గా ప్ర‌భావం చూపించేవి కావు. కానీ ఇపుడు బాలీవుడ్ మాదిరి ఇక్క‌డ కూడా సీక్వెల్స్‌కు ప్రేఓకులు ప‌ట్టం క‌డుతున్నారు. ఇక ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన  టిల్లు స్క్వేర్ మూవీ అంచ‌నాల‌కు మించి వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. నాల్గో రోజు వ‌ర్కింగ్ డే లో కూడా మంచి హోల్డ్ చూపించింది. 'డీజే టిల్లు' అనే బ్రాండ్‌తో  టిల్లు స్వ్కేర్ మూవీ మీడియం రేంజ్ మూవీల్లో స‌రికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది.  ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ బాయ్‌గా మారాడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా 'టిల్లు స్వ్కేర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొత్తంగా టిల్లు బ్రాండ్‌తో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక జోరు అదే విధంగా కంటిన్యూ అయింది. టిల్లు స్క్వేర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. నాల్గో రోజు వ‌ర్కింగ్ డే అయినా.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా మంచి జోరు చూపించింది. ఈ సినిమా సక్సెస్‌తో హీరోగా సిద్దు రేంజ్‌ పెరిగింది. ఈ సీక్వెల్‌తో మరోసారి ప్రేక్షకులను తన మాయలో పడేసాడు.  రిలీజ్ రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకొని బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది.  తొలిరోజే దాదాపు రూ. 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది 'టిల్లు స్క్వేర్' మూవీ రెండో రోజు అదే జోరును కొనిసాగించింది. అటు 10th, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పూర్తి కావడం టిల్లు స్క్వేర్‌కు కలిసొచ్చాయి. మొత్తంగా వెళుతూ, వెళుతూ  మార్చి నెలకు గుడ్ ఎండ్ కార్డ్ వేసిందనే చెప్పాలి. మొత్తంగా నాల్గు రోజుల్లో ఈ సినిమా రూ. 78 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిద్దు జొన్నలగడ్డ 10 యేళ్ల క్రితం  నాగ చైతన్య హీరోగా నటించిన 'జోష్‌' మూవీలో చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి చిన్నా చితకా పాత్రలతో అల‌రిస్తున్నాడు.  మొత్తంగా ఎన్నో ఒడిదుడుకుల తర్వాత సిద్దుకు డీజే టిల్లు మూవీతో పెద్ద బ్రేక్ వచ్చింది.  తాజాగా టిల్లు స్క్వేర్ మూవీతో మ‌రోసారి అది ప్రూవ్ అయింది.


టిల్లు స్క్వేర్ విషయానికొస్తే.. మొదటి పార్ట్ చూసినవారు రెండో పార్ట్‌కు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇక డీజే టిల్లు మాదిరి మాత్రం ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. మొత్తంగా ఈ సినిమా మరి చెత్తగా లేదు... మరి కొత్తగా లేదనే వాదనలు ప్రేక్షకుల నుంచి వ‌చ్చింది. అయానా.. మౌత్ ప‌బ్లిసిటీతో దూసుకుపోతుంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 78 కోట్ల‌గ్రాస్ (రూ. 40 కోట్ల షేర్) వ‌సూళ్లను రాబ‌ట్టిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా దాదాపు 15 కోట్ల‌కు పైగా లాభాల‌ను తీసుకొచ్చింది.


ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..


తెలంగాణ  (నైజాం).. రూ. 8 కోట్లు..
రాయలసీమ( సీడెడ్).. రూ. 3 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 11 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 22 కోట్లు


కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్.. రూ. 2 కోట్లు
ఓవర్సీస్ .. రూ. 3 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 15 కోట్ల ఫ్రాఫిట్ అందుకొని టాలీవుడ్‌లో 2024లె  మరో ఎపిక్‌గా హిట్‌గా నిలిచింది. అంతేకాదు హనుమాన్ తర్వాత ఆ రేంజ్ హిట్ ఈ సినిమాకే దక్కింది.ఈ సినిమా జోరు చూస్తుంటే.. ఈ సినిమా ముందు ముందు బాక్సాఫీస్ దగ్గర ఎన్నిరికార్డుల‌ను బ్రేక్ చేస్తుందో చూడాలి.  ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు సోల్డ్ అయిపోయాయి. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 15 కోట్లకు  తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం దాదాపు రూ. 5 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Read More: Pregnant Colleague: ఇదేం కన్నింగ్ బుద్ధి.. ప్రెగ్నెంట్ లేడీ తాగే నీటిలో విషం కల్పిన సహోద్యోగి.. కారణం తెలిస్తే షాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook