Hamsa Nandini Photoshoot: క్యాన్సర్‌తో పోరాటం.. గుండుతో హీరోయిన్ ఫోటోషూట్! నా లవ్ కోసం బలంగా తిరోగిస్తా!
Hamsa Nandini Photoshoot. హంసా నందిని ఓ వైపు క్యాన్సర్ చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు ఫొటో షూట్‌లో పాల్గొన్నారు.
Hamsa Nandini Photoshoot: '2007లో వచ్చిన అనుమానాస్పదం' అనే సినిమాతో హంసా నందిని (Hamsa Nandini) తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్ అయినా ఆమెకు హీరోయిన్గా పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. అయితే అందం, అభినయం ఉన్న హంసా.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ నిలదొక్కుకున్నారు. ఒకవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూనే.. మరోవైపు అతిథి పాత్రల్లో మెరిశారు. జై లవ కుశ, అత్తారింటికి దారేది, పంతం, మిర్చి, బెంగాల్ టైగర్ లాంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి తన ముద్ర వేశారు.
గత కొద్ది రోజుల క్రితం హంసా నందిని క్యాన్సర్ (Hamsa Nandini Cancer) బారిన పడిన సంగతి తెలిసిందే. తాను గ్రేడ్ 3 క్యాన్సర్‌తో పోరాడుతున్నట్టు హంసా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ చికిత్స జరుగుతుంది. హంసా ఓ వైపు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. తాజా షూట్‌లో ఆమె గుండుతో కనిపించారు. ఈ ఫొటో షూట్‌లో భాగంగా హంసాకి స్టైలిష్‌గా పని చేసిన అమీ పటేల్ (Ami Patel) ఆమెలో కొన్ని భావాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
'మీరు చాలా అందంగా కనబడుతున్నారు. మీ ఫొటో బలం, నమ్మకం, అందాన్ని ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు కేన్సర్‌తో మీరు చేస్తున్న యుద్ధం మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. మీరు దీని నుంచి మీరు విజయవంతంగా బయటకు వస్తారు. ఇంకా అందంగా వస్తారు. మేమంతా మీ వెంటే ఉంటాం' అని అమీ పటేల్ పేర్కొన్నారు. ప్రస్తుతం హంసా నందిని ఫొటో షూట్ (Hamsa Nandini Photoshoot)కు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
18 ఏళ్ల క్రితం హంసా నందిని అమ్మ బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోయారు. వంశ పారంపర్యంగా తనకు క్యాన్సర్ సమస్య ఎక్కడ వస్తుందోనని ఆమె భయపడుతూనే ఉన్నారు. కానీ చివరకు ఆమె భయపడినట్టే జరిగింది. హంసాకు బెస్ట్ క్యాన్సర్ మూడో గ్రేడ్‌లో ఉంది. గత డిసెంబరు నాటికే 9 విడతల కీమోథెరపీ పూర్తయిందని, ఇంకా ఏడు సార్లు చేయించుకోవాలనీ హంసా పేర్కొన్నారు. యాక్టింగ్ తన ఫస్ట్ లవ్ అని.. అందుకోసం ఇంకా బలంగా, మెరుగ్గా తిరిగి వస్తానని కూడా అన్నారు. ఆమె నమ్మకం నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
Also Read: Akhanda Roar On Hotstar: బాలయ్య బాబునా మజాకా.. థియేటర్లలోనే కాదు ఇళ్లల్లో కూడా మాస్ జాతరే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook