Sami Sami Song: పాన్ ఇండియా సినిమా పుష్ప సృష్టిస్తున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పుష్ప పాటలకు వివిధ దేశాల్లోని సెలెబ్రిటీలు స్టెప్పులేస్తున్నారు. తాజాగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కుమార్తెలు కూడా చిందులేసి నవ్విస్తున్నారు. అదేదో మనమూ చూద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సాధించిన క్రేజ్ ఓ ఎత్తైతే..అందులో పాటలు మరో ఎత్తు. ప్రతి పాట ఓ హిట్. అందుకే పుష్ప సినిమా పాటలకు దేశ, విదేశాల్లో అందరూ అడిక్ట్ అయిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ స్టెప్పులేసి వీడియోలు షేర్ చేస్తున్నారు. మొన్న బంగ్లాదేశ్ క్రికెటర్ వికెట్ తీసిన ఆనందంలో తగ్గేదే లే అంటూ మ్యానరిజం చూపించాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి సందడి చేశాడు. నిన్న టీమ్ ఇండియా క్రికెటర్ సురేష్ రైనా కుటుంబంతో కలిసి అదే శ్రీవల్లి (Srivalli Song)పాటకు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. ఈ అన్ని వీడియోలు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి.


పుష్పలో ఊ అంటావా పాటైనా, శ్రీవల్లి పాటైనా, సామీ సామీ పాటైనా, ఇది నా అడ్డా అయినా..సరే అందరూ చిందులేస్తున్నారు. పుష్ప మేనియా అంతగా పట్టుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూతుళ్లు (David Warner Daughters) కూడా సామీ సామీ పాటకు(Sami Sami Song) చిందులేశారు. ఈ వీడియోను డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాలో షేర్ చేయగా..సో క్యూట్ అంటూ బన్నీ కామెంట్ చేస్తూ..నవ్వాపుకోలేకపోతున్నట్టుగా ఓ ఎమోజీని చేర్చాడు.



 


Also read: Sid Sriram: పాటల మాంత్రికుడు సిద్ధ్ శ్రీరామ్ ఒక్కోపాటకు పారితోషికం ఎంతో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook