Gopichand: తెలుగు చలన చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యైక గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ సందర్భంగా ఎత్తైన ప్రదేశం నుంచి జారి కిందకు పడ్డాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్యం, లౌక్యం సూపర్ హిట్ సినిమాల తరువాత అదే కాంబినేషన్ శ్రీవాస్-గోపీచంద్‌తో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా గోపిచంద్ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్‌లో భాగంగా ఓ ఫైన్ సీన్ డూప్ లేకుండా నటిస్తున్నాడు గోపీచంద్. షూటింగ్ స్పాట్‌లో కాస్త ఎత్తైన ప్రదేశంపై నుంచి కాలు జారి కిందకు పడ్డాడు. అదృష్ఠవశాత్తూ ఏం కాలేదని..క్షేమంగా ఉన్నారని దర్శకుడు శ్రీవాస్ స్పష్టం చేశాడు. అభిమానులు ఆందోళన చెందవద్దని కోరాడు.



డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బు ప్రత్యేక పాత్రల్లో నటించనున్నారు. మ్యూజిక్ మాంత్రికుడు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా..పళనిస్వామి కెమేరామెన్‌గా ఉన్నాడు. ఈ సినిమా గోపిచంద్‌కు 30వ సినిమా. ఇప్పటికే మరో సినిమా షూటింగ్ పూర్తి చేసుకని జూలై 1న విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా ఇది. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా, రావు రమేష్, సప్తగిరి, అనసూయ, సత్యరాజ్‌లు కీలకపాత్రలో కన్పించనున్నారు. 


Also read: Acharya Movie Review: ఆచార్య సినిమా హిట్టేనా..రివ్యూల్లో రేటింగ్ ఎంత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.