Kalyan Ram Comments: ఫ్యామిలీ అంటే మేమిద్దరమే, వైరల్ అవుతున్న కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు
Kalyan Ram Comments: టాలీవుడ్ నటుడు, నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Kalyan Ram Comments: ఏపీ రాజకీయాలపై టాలీవుడ్ నటుడు కళ్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఎవరికి మద్దతనే ప్రశ్నకు కళ్యాణ్ ఇచ్చిన సమాధానం ఆసక్తి రేపుతోంది. సందమూరి కుటుంబంపై ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా డెవిల్ రేపు విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారనేది సుస్పష్టంగా చెప్పేశారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
2024లో ఏపీలో ఇప్పటి వరకూ కనీవినీ ఎరుగని ఎన్నికలు జరగబోతున్నాయి. నందమూరి తారక రామారావు ఉన్న సమయంలో కూడా అలాంటి ఎన్నికలు జరగలేదు. ఏపీ ప్రజలు ఓ పెద్ద యుద్ధాన్ని చూడబోతున్న సమయంలో మీరు కూడా చూస్తూనే ఉంటారా లేక ఎటైనా మద్దతిస్తారా అనేది కళ్యాణ్ రామ్‌ను అడిగిన ప్రశ్న. దీనికి సమాధానంగా...సినిమా వేరు..రాజకీయాలు వేరు, రాజకీయం అనేది ఓ బాల్ గేమ్ లాంటిది. ఈ గేమ్‌లో కళ్యాణ్ రామ్ ఒక్కడి నిర్ణయమే ఉండదు. ఇది ఓ ఫ్యామిలీ విషయం. ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబంగానే తీసుకుంటాం. ఎటు ఎలా ప్రయాణించాలన్నా కలిసి నిర్ణయం తీసుకున్న తరువాత అటే వెళ్తాం అని చెప్పాడు. ఫ్యామిలీ అంటే మీరు, జూనియర్ ఎన్టీఆర్ అని అనుకోవాలా అనే మరో ప్రశ్నకు...ఫ్యామిలీ అంటే నేను తారక్ మాత్రమే. ఇంకెవరూ లేరు. కట్టకాలేవరకూ ఇద్దరం అన్నదమ్ములుగా ఒక కుటుంబంగా కలిసి ఉంటామని చెప్పుకొచ్చాడు.
అంటే కుటుంబంలో తారక్, కళ్యాణ్ రామ్ తప్ప మరెవరికీ చోటు లేదని చెప్పకనే చెప్పారు. కచ్చితంగా తండ్రి నందమూరి హరికృష్ణకు ఎదురైన అనుభవాల్ని కళ్యాణ్ రామ్ మర్చిపోలేనట్టుగా కన్పిస్తోంది. అందుకే కుటుంబం అంటే తాను, తారక్ తప్ప మరెవరూ లేరని సూటిగా చెప్పేశాడు. అందుకే కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also read: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఇంద్ర, 8 ఏళ్ల తర్వాత మళ్లీ జీ సినిమాలులో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook