Mahesh Babu: చిన్నారుల గుండె కోసం..మహేశ్ బాబు మరో ప్రయత్నం, సేవలు విస్తృతం
Mahesh Babu: సూపర్‌స్టార్ మహేశ్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా సూపర్ స్టారే. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మహేశ్ బాబు..మరో మంచిపనికి నాంది పలికారు. చిన్నారుల గుండెల్ని కాపాడే బృహత్తర పనికి శ్రీకారం చుట్టారు.
Mahesh Babu: సూపర్‌స్టార్ మహేశ్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా సూపర్ స్టారే. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మహేశ్ బాబు..మరో మంచిపనికి నాంది పలికారు. చిన్నారుల గుండెల్ని కాపాడే బృహత్తర పనికి శ్రీకారం చుట్టారు.
టాలీవుడ్ హీరో, సూపర్‌స్టార్ మహేశ్ బాబు నిజ జీవితంలో కూడా సూపర్‌స్టార్ అన్పించుకుంటుంటారు. సినిమా జీవితం, ఇతర వ్యాపారాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తుంటారు. ఆర్ధికంగా స్థోమత లేని కుటుంబాలకు అవసరమైన వైద్య చికిత్సను సొంత ఖర్చుతో నిర్వహిస్తుంటారు. ఇప్పటికే చాలామంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి ఉన్నారు. సేవా కార్యక్రమాలు చేసినా ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉన్నా..సొంత డబ్బాకు దూరమే అని చెప్పాలి. బహుశా అందుకే చాలామందికి మహేశ్ బాబు సేవా కార్యక్రమాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్ ఆపద్భాందవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఏకంగా వెయ్యికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు.వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు.
చిన్నారుల హార్ట్ సర్జీల నిమిత్తం సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే రెయిన్‌బో, ఆంధ్రా హాస్పటల్స్‌తో కలిసి పనిచేస్తున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే అవసరమైన చాలామంది నిరుపేద చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు.మరి కొంతమందికి వైద్య చికిత్స అందించారు. ఇప్పుడు మహేశ్ బాబు ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేసింది. రెయిన్‌బో హాస్పటల్‌కు చెందిన లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయేనున్నామని సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రకటించారు. చిన్నారులు ఎప్పుడూ తన మనస్సుకు చేరువగా ఉంటారని..కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు ఫౌండేషన్ ద్వారా తోడ్పాటు అందించడం ఆనందంగా ఉందన్నారు మహేశ్ బాబు.
Also read: Radhe Shyam Making Video: రాధేశ్యామ్ మేకింగ్ వీడియో.. ఇండియాలోనే ఇటలీని చూపించేశారుగా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook