Guntur Karam Review: గుంటూరు కారం సినిమా రివ్యూ, ప్రేక్షకులు ఏమంటున్నారంటే

Guntur Karam Review: సూపర్‌స్టార్ మహేశ్ బాబు-దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గుంటూరు కారం ధియేటర్లలో విడుదలైంది. ఓ అగ్రశ్రేణి దర్శకుడు మరో అగ్ర నటుడి సినిమా..అంచనాలను చేరుకుందా లేదా, ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది, సినిమా రివ్యూ ఏంటనేది తెలుసుకుందాం.
Guntur Karam Review: మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. సినిమాపై ప్రేక్షకుల్నించి మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. దర్శకుడిగా సినిమా మైనస్ కాగా, నటుడిగా ప్లస్ అంటున్నారు ప్రేక్షకులు.
గుంటూరు కారం సినిమా చూస్తే దర్శకుడు త్రివిక్రమ్‌లో పస పూర్తిగా తగ్గినట్టే అన్పిస్తోంది. తల్లీకొడుకుల బంధాన్ని ఆసక్తిగా మల్చడంలో త్రివిక్రమ్ విఫలమయ్యాడు. కధ పరంగా సినిమాకు మైనస్ మార్కులే పడుతున్నాయి. సినిమా కధ ఏంటనేది ప్రారంభంలోనే తేలిపోవడం అతి పెద్ద మైనస్. సినిమా చూడాలనే ఆసక్తి పోతుంది. తల్లీ కొడుకుల పాత్రపై ఉండాల్సిన పట్టు కన్పించలేదు. కొడుకుతో అగ్రిమెంట్ సైన్ చేసినంత మాత్రాన రాజకీయంగా ఇబ్బందులు రావని చూపించడంలో లాజిక్ పూర్తిగా మిస్సయింది. త్రివిక్రమ్ చూపించిన రాజకీయ ఎత్తుగడలు సహజత్వానికి దూరంగా ఉన్నాయి.
ఇక సినిమాకు ప్లస్ పూర్తిగా మహేశ్ బాబు నటన. మహేశ్ బాబు పాత్ర చేసే హంగామా, అతని ఎనర్జీ, మాస్ పాటలు, క్లైమాక్స్ సీన్స్, కొన్ని ఎమోషనల్ దృశ్యాలు సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. సినిమాకు మహేశ్ బాబు నటన హైలైట్. అద్భుతమైన డ్యాన్స్ కూడా కన్పిస్తుంది. కుర్చీ మడతపెట్టి పాటలో మహేశ్, శ్రీలీల హంగామా చూసి తీరాల్సిందేనంటున్నారు ప్రేక్షకులు. మహేశ్ బాబు నటన, శ్రీలీల డ్యాన్స్ సినిమాకు బలం కాగా, కధ, కధనం పూర్తిగా మైనస్. త్రివిక్రమ్ మార్క్ సినిమాలో కన్పించలేదు.
ఓవరాల్‌గా చెప్పాలంటే గుంటూరు కారం సినిమా మాస్ ని ఆకర్షిస్తుంది. అలరిస్తుంది. దర్శకుడిగా త్రివిక్రమ్ ఈ సినిమాతో ఫెయిల్ కాగా నటుడిగా మహేశ్ బాబు నెక్స్ట్ లెవెల్ చూపించాడంటున్నారు. కేవలం మహేశ్ బాబు నటన కోసమే సినిమా చూడవచ్చు. త్రివిక్రమ్‌లో ఇప్పుడు కొత్తదనం కన్పించడం లేదనేందుకు ఈ సినిమానే ఉదాహరణ.
Also read: Guntur Kaaram Honest Review: పబ్లిక్ మాటల్లో గుంటూరు కారం హానెస్ట్ రివ్యూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook