Pawan Kalyan: టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్, ఆందోళనలో ఫ్యాన్స్
Pawan Kalyan Tests Positive For Covid-19 | ఆయన వ్యక్తిగత, సెక్యూరిటీ సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్‌కు వెళ్లానని ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్ అని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
Pawan Kalyan Tests Positive For CoronaVirus: జనసేన అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు తాజాగా నిర్వహించిన టెస్టులలో కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. ఆయన వ్యక్తిగత, సెక్యూరిటీ సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం క్వారంటైన్‌కు వెళ్లానని ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. లక్షణాలు కనిపించడంతో టెస్టులు జరపగా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారని జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్‌కు చేరుకున్న తరువాత నలతగా ఉండటంతో డాక్టర్ల సలహా మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కరోనా నెగెటివ్ వచ్చినా, తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గకపోవడంతో రెండు రోజుల కిందట మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, కోవిడ్19(COVID-19) పాజిటివ్ అని తేలింది. ఖమ్మంకు చెందిన డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్ కళ్యాణ్‌కు చికిత్స అందిస్తున్నారు.
Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి
పవన్ కళ్యాణ్‌కు ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటీవైరల్ మందులతో చికిత్స చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటున్నారని ప్రకటనలో తెలిపారు. అపోలో వైద్యుల టీమ్ సైతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు పరీక్షలు చేసింది. జ్వరం, ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గేందుకుగానూ మెడిసిన్ వాడుతున్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని ఆయన తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook