Pawan Kalyan: రెమ్యునరేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ రూటు మారిందా?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ (Pawan Kalyan Remuneration) విషయంలో కొత్త విషయం తెరపైకి వచ్చింది. అందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.
హైదరాబాద్: టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటులలో పవన్ కల్యాణ్ ఒకరు. ఆయన సినిమాకు జస్ట్ యావరేజ్‌గా ఉందని టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో కంగారు అక్కర్లేదని తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ పారితోషికం విషయం తాజాగా హాట్ టాపిక్ అవుతోంది. రెమ్యునరేషన్ విషయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు దారిలోనే పవన్ కల్యాణ్ నడవనున్నారట. Salman Khan About SP Balu: ఎస్పీ బాలు సార్.. మీ పాటలు నాకెంతో ప్రత్యేకం: సల్మాన్ ఖాన్
పవన్ కల్యాణ్‌తో ప్రస్తుతం దిల్ రాజు ‘వకీల్ సాబ్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్టులు పవన్ చేతిలో ఉన్నాయని వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా హీరోలకు పారితోషికం కన్నా బిజినెస్ పార్ట్‌నర్ ఇస్తేనే తమకు కూడా కాస్త ఊరట అనిపిస్తుందని కొందరు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. మహేశ్ బాబు ఇప్పటికే తన సినిమాలలో కొన్నింటికి రెమ్యునరేషన్, కొన్ని సినిమాలకు బిజినెస్ పార్ట్‌నర్ షిప్ తీసుకుంటాన్నరని తెలిసిందే. SPB health update: బాలు ఆరోగ్యం మరింత విషమం.. ఆస్పత్రికి చేరుకున్న కుటుంబం, కమల్ హాసన్
బాక్సాఫీసు వద్ద సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తే అందులో ముందుకు కుదుర్చుకున్న ప్రకారం తన వాటా నగదు అందుకుంటారు. సినిమా బిజినెస్ అంతక చేయకపోతే తమకు హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ సమస్య నేరుగా తొలగిపోతుందన్న అభిప్రాయం నిర్మాతలకు సైతం ఉంది. మహేశ్ బాబు తరహాలోనే పవన్ కల్యాణ్ సైతం బిజినెస్ పార్ట్‌నర్ షిప్‌ను తన దారిగా ఎంచుకుని సినిమాలు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ ఎంత మేర షేర్ తీసుకోనున్నారు. డీల్ నిజంగానే కుదుర్చుకున్నారా తెలియాలంటే కొన్నిరోజులు వేచిచూడక తప్పదు. RCB కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe