Rajendra Prasad Tests Covid 19 Positive: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో ఆయన కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో.. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాల విషయానికొస్తే ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ నటించిన 'సేనాపతి' మూవీ ఆహా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా డీసెంట్ హిట్‌ను సొంతం చేసుకుంది. 2017లో తమిళంలో వచ్చిన '8 తొట్టక్కల్' (8 Thottakkal) సినిమాకు తెలుగు రీమేక్‌గా 'సేనాపతి'ని తెరకెక్కించారు. ప్రేమ ఇష్క్ కాద‌ల్‌ ఫేమ్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. 


సినీ ఇండస్ట్రీని వెంటాడుతున్న కరోనా : 


కొద్దిరోజులుగా టాలీవుడ్‌‌ నటీనటులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇటీవలే హీరో మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఇద్దరు హోమ్ ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు. అంతకుముందు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ తదితరులు కరోనా బారినపడ్డారు. 


కేవలం టాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని సినీ ఇండస్ట్రీలను కరోనా వెంటాడుతోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే కరీనా కపూర్, అమృత అరోరా, అర్జున్ కపూర్ తదితరులు కరోనా బారినపడ్డారు. కోలీవుడ్‌లో సత్యరాజ్, వడివేలు, మీనా, త్రిష, అరుణ్ విజయ్, కమల్ హాసన్ తదితరులు కరోనా బారినపడ్డారు. వీరిలో వడివేలు, కమల్ హాసన్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారు. మిగతా నటులు ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్నారు.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా (Covid Cases)మరోసారి విజృంభిస్తుండటంతో సినీ ఇండస్ట్రీపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. కరోనా తగ్గుముఖం పడితే కానీ ఆ సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.


Also Read: Mahesh Babu Emotional: ఎప్పటికీ నా అన్నయ్యవే.. రమేష్ బాబు మరణంపై మహేష్ ఎమోషనల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook