Ramarao On Duty: టాలీవుడ్ అగ్ర నటుడు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా చుట్టూ వివాదం ముసురుకుంటోంది. రవితేజకు, నిర్మాత మధ్య వివాదంతో మరోసారి వాయిదా పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా ఉన్న రవితేజ తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. జూన్ 17 న విడుదల కావల్సిన సినిమా వాయిదా పడిందని చిత్ర యూనిట్ తెలిపింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కానందున సినిమా వాయిదా తప్పడం లేదని ఎస్ఎల్‌వి సినిమాస్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 


వాస్తవానికి కారణాలు మాత్రం మరోలా ఉన్నాయి. సినిమా ప్రారంభానికి ముందే హీరో, నిర్మాత, దర్శకుల మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం సినిమా బిజినెస్‌ను బట్టి వాటా ఉంటుంది. ఇటీవల ఈ సినిమా పోస్టర్లు, టీజర్‌పై హైప్ ఎక్కువవడంతో..ధియేటర్,, శాటిలైట్, ఓటీటీ హక్కుల విషయంలో బిజినెస్ పెరిగిందని తెలుస్తోంది. దాంతో తనవాటా విషయంలో రవితేజ డిమాండ్ చేయడంతో వివాదం ప్రారంభమైంది. ఈ నేపధ్యంలోనే సినిమా వాయిదా వేసినట్టు సమాచారం. వాటాల విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగితేనే సినిమా విడుదలపై క్లారిటీ రావచ్చు. గతంలో ఓసారి వాయిదా పడింది. ఇప్పుుడు వాయిదా పడటం రెండవసారి. జూన్ 17వ తేదీన రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల కావడం లేదు.


Also read: Sonali Bendre: ఎన్టీఆర్‌ చిత్రంలో సోనాలి బింద్రే.. అసలు విషయం చెప్పేసిన హీరోయిన్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook