Uttej Wife Passed Away: టాలీవుడ్ ప్రముఖ నటుడు 'శివ' సినిమా (Shiva Movie)ఫేం ఉత్తేజ్ (Uttej)ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంత కాలంగా కేన్సర్ తో బాధపడుతున్న ఆయన సతీమణి పద్మావతి (Padmavathi) కొద్ది సమయం కిందట మరణించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేన్సర్ కారణంగా బాధపడుతున్న ఆమెను నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు చెందిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో (Basava Tharakam Cancer Hospital) చేర్పించారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించటంతో తుది శ్వాస విడిచారు. 


Also Read: Aadhaar-Epfo link: మీ పీఎఫ్ అక్కౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేశారా, ఇదే చివరి తేదీ


ఉత్తేజ్ నిర్వచించే అన్ని రకాల సేవా కార్యకమాల్లో ఆయన సతీమణి పద్మావతి యాక్టివ్ గా పాల్గొనే వారు. ఉత్తేజ్ ప్రారంభించిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ (Mayuka Talkies Film Acting School) లో ఆమె విధులను నిర్వహిస్తూ ఉండేవారు. ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ కుటుంబ సభ్యులు కన్నీటి పరంతమవుతున్నారు. విషయం తెలిసిన ప్రముఖులు మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj),జీవిత రాజశేఖర్‌ (Jeevitha Rajashekar) మరియు ఇతర ప్రముఖులు ఉత్తేజ్‌ను పరామర్శించారు. 




Also Read: BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 నుంచి సరయూ నామినేషన్‌కు కారణాలివే


ఉత్తేజ్ మొదటగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వం వహించిన నాగార్జున  హీరోగా నటించిన శివ సినిమా తో నటుడిగా పరిచయం అయ్యారు. నటనతో రచయితగా మంచి అవకాశాలు పొందారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన "మనీ", (Money)"మనీ మనీ" (Money-Money), "ఖడ్గం" (Khadgam) వంటి హిట్ సినిమాలకు మాటల రచయితగా పని చేసారు. 


అటు నటన, రచయితగా చేసిన ఉత్తేజ్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తేజ్ కూతురు కూడా హీరోయిన గా తన లక్ ను పరీక్షించుకుంది. ఈ విషయం ఇలా ఉండగా ఉత్తేజ్ సతీమణి పద్మావతి అత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి.


Also Read: Covid19 Death Certificate: కోవిడ్ డెత్ సర్టిఫికేట్ల జారీలో మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, ఇవే ఆ అంశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి