Hamsa Nandini diagnosed with cancer: టాలీవుడ్ నటి హంసా నందిని క్యాన్సర్ (Hamsa Nandini) బారినపడ్డారు. నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతిని గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకోగా హంసానందినికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే సర్జరీ ద్వారా కణతిని తొలగించుకోవడంతో శరీరంలోని ఇతర అవయవాలకు క్యాన్సర్ సోకకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ఆ ఉపశమనం ఎంతోసేపు నిలవలేదు. ఆ తర్వాత చేయించుకున్న వైద్య పరీక్షల్లో ఆమెకు జన్యుపరమైన క్యాన్సర్ (Heridity Cancer) ఉన్నట్లు తేలింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా హంసా నందిని ఈ వివరాలు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'జీవితం నన్ను ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా... నేనొక బాధితురాలిగా ఉండదలుచుకోలేదు. భయం, నిరాశ, నెగిటివిటీ నన్ను ప్రభావితం చేయడాన్ని ఒప్పుకోను. ప్రేమతో, ధైర్యంతో వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతాను. నాలుగు నెలల క్రితం రొమ్ములో చిన్న కణతి ఉన్నట్లు అనిపించింది. ఇక జీవితం ఇప్పటిలా ఉండదనే విషయం అర్థమైంది. 18 నెలల క్రితమే నా తల్లిని కోల్పోయాను. అప్పటినుంచి భయంలోనే బతుకుతున్నాను.' హంసానందిని (Hamsa Nandini) పేర్కొన్నారు.


'రొమ్ములో కణతిని గుర్తించిన కొద్ది గంటల్లోనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను. పరీక్షల్లో నాకు గ్రేడ్ 3 రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. త్వరగా సర్జరీ చేయించుకోవడంతో శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాపించలేదు. అయితే ఆ రిలీఫ్ ఎంతోసేపు నిలవలేదు. ఆ తర్వాత చేసిన వైద్య పరీక్షల్లో నాకు జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) వచ్చే అవకాశం 70 శాతం, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం 40 శాతం ఉన్నట్లు తేలింది. ఇందుకోసం నేను పలు సర్జరీలు చేయించుకోవాల్సి ఉంది. ఇప్పటికే కీమోథెరపీ 9 దశలు పూర్తయ్యాయి. మరో 7 సార్లు కీమోథెరపీ చేయించుకోవాల్సి ఉంది. నా జీవితాన్ని క్యాన్సర్ ప్రభావితం చేయకూడదని నేను భావిస్తున్నాను. చిరునవ్వుతోనే క్యాన్సర్‌పై పోరాడుతాను.. మరింత ధృఢంగా మారి మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తాను...' అని హంసానందిని చెప్పుకొచ్చారు.



Also Read: Pooja Hegde: టూ పీస్ బికినీలో పూజా హెగ్డే అందాల ఆరబోత.. షేక్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి