Pooja Hegde joins Anil Ravipudi F3 Movie special song Shoot in Hyderabad: బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా దాదాపుగా ప్రతి సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంది. తెలుగు స్టార్ డైరెక్టర్‌లు సుకుమార్, పూరీ జగన్నాద్ తాము తీసే ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తారు. అందుకోసం స్టార్ హీరోయిన్‌లను ఎంచుకుంటారు. ఇదే ఫార్ములాను డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఫాలో అవుతున్నాడు. అనిల్ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా ఎఫ్‌ 3. ఈ సినిమాలోని స్పెష‌ల్ సాంగ్ కోసం బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంచుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్టరీ వెంక‌టేష్, మెగా హీరో వ‌రుణ్‌ తేజ్ కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ఎఫ్‌ 3. ఈ సినిమాలో ఓ పాట మిన‌హా షూటింగ్ మొత్తం పూర్తయింది. స్పెషల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుందని గ‌త వారం రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చివరకు అదే నిజమైంది. ఎఫ్‌ 3 స్పెష‌ల్ సాంగ్ షూట్‌లో పూజా హెగ్డే జాయిన్ అయిన‌ట్లు చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా వేదికగా ప్రకటించింది. పూజా ముఖం కనిపించకుండా.. బ్యాక్ స్టీల్ ఇచ్చిన ఫొటోను మేకర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. 


స్పెషల్ సాంగ్‌ కోసం పూజా హెగ్డే ఈరోజు హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం భాగ్యనగరంలో భారీ సెట్ వేసినట్టు తెలుస్తోంది. ఈ పాట కోసం పూజాకు పారితోషికం బాగానే అందిందట. పూజ ఇదివరకు 'జిగేల్ రాణి' అంటూ 'రంగ‌స్థ‌లం' సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో స్టెప్పులేసి అదరగొట్టింది. మరి ఎఫ్‌ 3 చిత్రంలో వెంక‌టేష్, వ‌రుణ్‌ తేజ్ సరసన బుట్టబొమ్మ కాలు కడపనుంది. ఇప్పటికే ఈ సినిమాలో గ్లామర్ క్వీన్స్ త‌మ‌న్నా, మెహ‌రీన్‌, సోనాల్ చౌహన్ ఉండగా.. తాజాగా పూజ కూడా జాయిన్ అయింది. దాంతో హాట్ సమ్మర్‌లో ప్రేక్షకులకు కూల్ అందాలు కవ్వించనున్నాయి. 



2019లో వచ్చిన ఎఫ్‌ 2 సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే ఎఫ్‌ 3. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌ రాజు, శిరీష్ నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రొమాంటిక్ కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఎఫ్‌ 3 అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి నమ్మకంగా ఉన్నాడు. ఎఫ్‌ 3 భారీ తారాగణం ఉన్న విషయం తెలిసిందే. 


Also Read: SRH Playing 11 vs KKR: కోల్‌కతాతో సన్‌రైజర్స్ ఢీ.. వాషింగ్టన్ సుందర్ దూరం! ఇక తుది జట్టులో చోటు అతడికే..


Also Read: Joe Root Captaincy: కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన జో రూట్‌.. అసలు కారణం అదే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook