Samantha Ruth Prabhu: అందమైన అమ్మాయిగా నటించి అలసిపోయా.. ఇక అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నా!
ఇప్పటివరకు అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి తాను అలసిపోయానని, ఇక మీదట ఆ రోల్స్ చేయడాని సిద్ధంగా లేనని స్టార్ హీరోయిన్ సమంత తెలిపారు.
Tollywood Actress Samantha says I was tired of playing the cute girl in every film: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)తో విడాకుల అనంతరం స్టార్ హీరోయిన్ సమంత (Samantha) వరుస సినిమాలకు సైన్ చేస్తూ పోతున్నారు. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్న సామ్.. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను చేస్తున్నారు. ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. ప్రస్తుతం రాజ్-డీకే దర్శకత్వంలో రోపొందుతోన్న మరో వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం సామ్ గోవా (Goa)లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
దక్షిణాదిలో స్టార్ కెరీర్ ఉన్న మీరు ఇప్పుడు బాలీవుడ్ (Bollywood) చిత్రనిర్మాతల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించారు ఎందుకు అని అడగ్గా.. 'నేను వెబ్ సిరీస్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఆలోచన అప్పటి వరకు లేదు. కానీ రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డీకే నా ఆలోచనల్లో మార్పు తెచ్చారు. కుదరదు అని చెప్పకూడదని నిర్ణయించుకున్నా. రాజీ పాత్రకు నేను ఊహించినదానికంటే ఎక్కువ ప్రశంసలు అందుకున్నాను. నేను ఇప్పుడు కొత్త సవాళ్లను స్వీకరించగలననే నమ్మకం ఏర్పడింది' అని సమంత చెప్పారు. ఫ్యామిలీ మెన్-2లో మనోజ్ బాజ్‌పేయితో పోటీపడి మరీ నటించారు.
బాలీవుడ్‌కు ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నారు అనే ప్రశ్నపై సమంత మాట్లాడుతూ... 'దక్షిణాదిలో మంచి స్థానం దక్కడమే దీనికి కారణం. గత రెండేళ్లలో నా పని తీరులో చాలా నమ్మకం ఏర్పడింది. నచ్చని పాత్రలు చేయడం లేదు. గత రెండేళ్లలో పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు సవాళ్లను స్వీకరించడంపై నాకు నమ్మకం ఉంది. నేను ప్రతిదీ ప్రయత్నించను. నేను సాధారణంగా ఏదైనా పని పూర్తి చేయడానికి సమయం తీసుకుంటాను. మరొక సవాలుకు వెళ్లే ముందు చాలా ఆలోచిస్తా. అందుకే బాలీవుడ్‌కు రావడానికి ఇంత సమయం పట్టింది' అని తెలిపారు.
గ్లామర్ రోల్స్ (Glamorous Roles)పై సామ్ స్పందిస్తూ... 'ఇప్పటివరకు అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి అలసిపోయాను. ఇక మీదట ఆ రోల్స్ చేయడానికి నేను సమర్థురాలిని కాదని నమ్ముతున్నా. నటిగా ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నా. నేను గతంలో చాలా రీమేక్‌లు చేసాను కానీ ఇప్పుడు ఆ మూడ్ లేదు. నా కోసం ఒక గొప్ప స్క్రిప్ట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఏడాదంతా నన్ను సంతోషపెట్టే గొప్ప స్నేహితులు నాకు ఉన్నారు. కాబట్టి నేను వారితో, నా కుక్క మరియు తల్లితో సమయం గడపాలని చూస్తున్నాను. అమ్మతో ఉండడం గొప్ప ఫీలింగ్' అని సమంత (Samantha Ruth Prabhu) చెప్పుకొచ్చారు.
Also Read: Acharya Movie Update: మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'ఆచార్య' నుంచి మరో సాంగ్ రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook