Tollywood Assistant Director Arrested in Prostitution Case: హైదరాబాద్ లో ఆన్లైన్ వ్యభిచారం చేస్తున్న ఒక ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఒక తెలుగు టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఒక యువకుడిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. 2017 నుంచి ఒక ప్రముఖ డైరెక్టర్ దగ్గర సురేష్ బోయిన అనే వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అతను సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రముఖుల వద్దకు ఆ యువతులను వ్యభిచారం నిమిత్తం పంపిస్తున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తూ గోవా బెంగళూరులో సైతం కావలసిన విటుల వద్దకు సురేష్ వారిని పంపిస్తున్నట్టు గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతనితోపాటు అఖిల్ కుమార్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు, సినిమా అవకాశాల పేరుతో తెలుగు అమ్మాయిలనే కాక ముంబై ఢిల్లీ బెంగాల్ నుంచి కూడా అమ్మాయిలను తెచ్చి వ్యభిచారం చేసినట్లు గుర్తించారు.అమ్మాయిల ఫోటోలను ఆన్లైన్లో పెట్టి వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు. హైదరాబాద్ లోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు తాజాగా ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారని అంటున్నారు.


హోటల్స్, ఓయో రూమ్స్ అడ్డాగా వ్యభిచారం సాగుతున్నదని వెస్ట్ బెంగాల్, ముంబై, ఢిల్లీ నుంచి అమ్మాయిలను రప్పించి వారిని వ్యభిచారంలోకి ఆర్గనైజర్స్ సురేష్, అఖిల్ రెడ్డి దింపారని అంటున్నారు. లోకంటో, స్కొక్క, బ్యాక్ పేజి వెబ్ సైట్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెడుతూ విటులను ఆకర్షిస్తున్నట్టు చెబుతున్నారు.


పాత కస్టమర్స్ కు వాట్స్ అప్ ద్వారా అమ్మాయిల ఫోటోలు పంపి వ్యభిచారం చేయిస్తున్నారు బ్రోకర్స్, ఇద్దరు నిందితులు గతంలో 4 బ్రోతల్ కేసులలో బుక్ అయ్యారని చెబుతున్నారు. 35 మంది అమ్మాయిలను నిందితుడు అఖిల్ రెడ్డి వ్యభిచారంలోకి దించగా 500 మంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. ప్రతి అమ్మాయి డీల్ వెనుక 40% కమిషన్ గా అఖిల్ రెడ్డి తీసుకుంటున్నట్టు గుర్తించారు. తెలుగులో ప్రముఖ డైరెక్టర్ దగ్గర  అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న బోయిన సురేష్ హై ఫై అమ్మాయిలను  బిగ్ షాట్స్ వద్దకు పంపేలా సురేష్ చేస్తున్నాడని అంటున్నారు. 


Also Read: Vani Jayaram Passed Away: కే విశ్వనాద్ మరణం మరువక ముందే మరో విషాదం... రోజుల వ్యవధిలోనే వాణి జయరాం మృతి!


Also Read: Vani Jayaram Death Suspicion: వాణి జయరాం నుదుటిపై గాయాలు... అనుమానాస్పద రీతిలో హాస్పిటల్ కు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.