Tollywood Audience: క్లాస్ సినిమాలా అబ్బే వద్దండీ అంటున్న ఆడియన్స్.. థియేటర్ కు రావాలంటే ఆమాత్రం ఉండాల్సిందే!
Tollywood Audience Perception Changed: క్లాస్ సినిమాల విషయంలో టాలీవుడ్ ఆడియన్స్ దృష్టి మారిపోయిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Tollywood Audience Perception Changed on Class Movies: ఒకప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులు క్లాస్ సినిమాలతో పాటు మాస్ సినిమాలను కూడా ఆదరించేవారు. అయితే కాలక్రమంలో క్లాస్ సినిమాలకు ఆదరణ తగ్గుతోందనే భావన కలుగుతోంది. దానికి కారణం ఈ మధ్యకాలంలో నాని హీరోగా నటించిన అంటే సుందరానికి, శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం, విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇవి ఏమాత్రం మాస్ టచ్ లేని క్లాస్ లవ్ ఎంటర్టైనర్ మూవీస్, ఒకే ఒక జీవితం కాస్త సైంటిఫిక్ మూవీ అనిపించుకున్నా మాస్ సినిమా అయితే కాదు. అయితే ఈ సినిమాలకు మంచి టాక్ అయితే లభించింది సినిమా చాలా కూల్ గా ఉందని ఖచ్చితంగా చూసి తీరవచ్చని రివ్యూయర్లు తమ రివ్యూలు ఇచ్చారు కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఎలాగో ఓటీటీలో వచ్చేస్తాయి కదా ఇప్పుడు థియేటర్ దాకా వెళ్లి సినిమా చూడాలా అని అనుకుంటున్నారో లేక క్లాస్ మూవీస్ ఏ కదా థియేటర్ లో చూస్తే ఏంటి?ఇంట్లో టీవీలో చూస్తే ఏంటి? అని లైట్ తీసుకుంటున్నారో, అర్థం కావడం లేదు.
కానీ పూర్తిస్థాయిలో క్లాస్ సినిమాలకు మాత్రం తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం లభించడం లేదనేది సుస్పష్టం అవుతుంది. అదే సమయంలో ఇతర భాషల సినిమాలు అయినా సరే మాస్ ఎలిమెంట్స్ తో కూడి ప్రేక్షకులను ఎగ్జయిట్ చేసే విధంగా ఉంటే థియేటర్లకు వెళ్లి కూడా చూసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. అందుకు రీసెంట్గా విడుదలైన కాంతార సినిమా ఒక ఉదాహరణ. ఈ సినిమాని తెలుగులో కేవలం రెండే రెండు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి విడుదల చేశారు.
కానీ ఈ సినిమా ఇప్పటికే దాదాపు 20 కోట్లు దాకా తెలుగులో వసూలు చేసింది అంటే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎంతరా ఆదరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్నిబట్టి ఇకమీదట సినిమాలు తీసే దర్శక నిర్మాతలు క్లాస్ సినిమాలను ఓటీటీకే పరిమితం చేసుకుంటే బాగుంటుందేమో అనే టాక్ వినిపిస్తోంది. క్లాస్ సినిమా అయినా సరే ఇది థియేటర్లో తప్ప ఓటీటీలో చూడకూడదు అనిపించేలా ఏదైనా ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటే తప్ప భవిష్యత్తులో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కాస్త కష్టమైన పనే. చూడాలి మరి దర్శక నిర్మాతలు ఈ విషయం మీద ఎంత దృష్టి పెడతారు అనేది.
Also Read: Kriti Sanon Pics: లెహంగాలో కృతి సనన్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ స్మైల్‌కు పడిపోవాల్సిందే!
Also Read: PawanKalyan with Meher Ramesh: పవన్ తో సినిమా చేసి తీరతానన్న మెహర్ రమేష్..టెన్షన్లో మెగా ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook