MAA Elections 2021 : ‘మా’ ఎన్నికల నేపథ్యంలో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి పోస్ట్ వైరల్
Ajay Bhupathis Viral Tweet: “ఆర్ఎక్స్ 100″తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం తన రెండో ప్రాజెక్ట్ “మహా సముద్రం”తో బిజీగా ఉన్నారు. తాజాగా అజయ్ భూపతి “మా” ఎన్నికలపై ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ వేశారు.
Tollywood director Ajay Bhupathis Viral Tweet On MAAElections 2021: "మా" ఎన్నికలు (MAA Elections) దగ్గర పడుతున్న కొద్దీ మాటల యుద్ధం సాగుతూనే ఉంది. రోజురోజుకు తెలుగు సినిమా (telugu cinema) ఇండస్ట్రీలో పరిస్థితులు మరింత వేడెక్కుతున్నాయి. మా ఎన్నికల్లో (MAAElections) బరిలో ప్రస్తుతం రెండే రెండు ప్యానళ్ల సభ్యులు పోటీపడుతున్న కూడా పోటీ మాత్రం రసవత్తరంగా మారింది.
ఒక వైపు మంచు విష్ణు ప్యానల్ (Manchu Vishnu), మరోవైపు ప్రకాష్‌రాజ్ (Prakash Raj) ప్యానల్ సభ్యుల మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా మాటల యుద్ధం సాగుతూనే ఉంది. ఈ రెండు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు పోటాపోటీగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఒకవైపు వార్ నడుస్తూనే ఉంది. మరోవైపు కరాటే కళ్యాణి, (karate kalyani) హేమ (Hema) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లోకల్, నాన్ లోకల్ అంటూ వార్ మొదలైంది.
రాజీవ్‌కనకాల, రవిబాబులాంటి (Ravi Babu) వాళ్లు డైరెక్ట్ అటాక్ చేసేస్తున్నారు. ఇక బెదిరిస్తున్నారు అంటూ ఒకరు.. డ్రామాలు అంటూ మరొకరూ ఇలా ఎవరికి వాళ్లు మా ఎన్నికల్లో నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. మరి ‘మా’ సభ్యులు ఎవరికి అధ్యక్షుడి పట్టం కట్టబెడతారో ఈ నెల 10న జరిగే ఓటింగ్ లో తేలనుంది. అయితే మా ఎన్నికల నేపథ్యంలో డైరెక్టర్ అజయ్ భూపతి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Chaysam Divorce: ప్రీతంపై పెరిగిన ట్రోల్స్..స్పందించిన సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధనా
“ఆర్ఎక్స్ 100″తో (Rx 100) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి (Ajay Bhupathi) ప్రస్తుతం తన రెండో ప్రాజెక్ట్ “మహా సముద్రం”తో (mahasamudram) బిజీగా ఉన్నారు. తాజాగా అజయ్ భూపతి “మా” ఎన్నికలపై ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ వేశారు. “నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా…(అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అజయ్. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. నిజంగానే అజయ్ భూపతితో ఎవరైనా డైరెక్టర్ అలా అన్నారా లేదంటే ఈ మాట ఆయన మనసులోనిదా అనేదా అని చర్చ సాగుతోంది. ఒకవేళ నిజంగానే అజయ్ భూపతితో ఎవరైనా డైరెక్టర్ అన్నారా అంటే ఆయన ఎవరంటూ ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చ సాగుతోంది. మొత్తానికి "మా" ఎన్నికలు (MAA Elections) దగ్గర పడుతున్న సమయంలో అజయ్ భూపతి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.