Tollywood Director Koratala Siva next Multi starrer movie with Nandamuri Balakrishna And SuperStar Mahesh Babu: 
కొరటాల శివ బాలకృష్ణ కోసం స్టోరీ రెడీ చేస్తున్నారట. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ ను అందించిన కొరటాల శివ (Koratala Siva) ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవితో ఆచార్య చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణకి (Balakrishna) సెట్ అయ్యే కథ కొరటాల శివ దగ్గర రెడీగా ఉందట. దాన్ని త్వరలో పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. 
ఇక కొరటాల శివ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్‌‌లే (Blockbuster) కాబట్టి.. ఆయన అడిగితే బాలకృష్ణ కూడా రిజెక్ట్ చేయరని తెలుస్తోంది. మొత్తానికి కొరటాల (Koratala) .. బాలయ్య కాంబో దాదాపు ఫిక్స్ అని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కొరటాల, బాలయ్యల మూవీపై మరో టాక్ కూడా నడుస్తోంది. ఈ మూవీలో మరో హీరో కూడా కీలక పాత్ర పోషించనున్నారట. ఆ పాత్రకుగాను.. ప్రస్తుతం మహేశ్‌బాబు (Mahesh Babu) పేరు బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే కొరటాల ఇప్పటికే మహేశ్‌తో రెండు సినిమాలు చేశారు. దీంతో మహేశ్ ఓకే చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మహేశ్‌ కాదంటే, మెగా క్యాంపు నుంచి మరో హీరోను (Mega Hero) ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట కొరటాల. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు.


Also Read : ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో..


ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే.. మాంచి స్క్రిప్ట్ (Script) రెడీ చేసి.. బాలయ్య, మహేష్‌లకు వినిపించి ఈ క్రేజీ ప్రాజెక్టుని అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ కొరటాల శివ (Director Koratala Shiva). ప్రస్తుతం బాలకృష్ణ, కొరటాల శివకి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యాకే వీరి కాంబోలో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పట్టలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi).. ఆచార్యకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు కొరటాల. తర్వాత ఎన్టీఆర్‌తో (NTR‌) కొరటాల సినిమా చేయాల్సి ఉంది. ఇక బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని, ఆ తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు.


Also Read : ఆరోగ్యం కోసం ఆవు పేడ తింటున్న డాక్టర్ వీడియో వైరల్.. నెటిజెన్స్ ఏమంటున్నారంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook