Sai Pallavi Marriage Rumours:  నేచురల్ బ్యూటీ, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవికి(Sai Pallavi) పెళ్లి అయిపోయిందనే వార్తలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్(Sai Pallavi Marriage Rumours) పై క్లారిటీ ఇచ్చేశాడు విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల. తన ఫేస్ బుక్ పోస్టుతో ఈ విషయానికి ఎండ్ కార్డు వేశాడు వేణు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఫోటోలో సాయి పల్లవితో ఉన్న వ్యక్తి తమిళ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి. ప్రస్తుతం సాయి పల్లవి కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీకి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో దిగిన ఫోటో ఇది అంటూ క్లారిటీ ఇచ్చేశాడు విరాటపర్వం డైరెక్టర్. 



శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చి 'ఫిదా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. తొలి సినిమాతోనే అందరిని ఫిదా చేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత నాని సరసన మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీలో నటించింది. ఇది కూడా ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత కణం, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ సినిమాలు చేసింది. అనంతరం వచ్చిన శ్యామ్ సింగరాయ్ లో ఈమె నటనకు ప్రశంసలు లభించాయి. విరాటపర్వం, గార్గి కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు తెలుగులో చైతూతో మరోసారి జోడి కట్టనుంది. చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్ నిర్మిస్తుంది.


Also Read: BB 7 Telugu: బిగ్‌బాస్‌లో ఈ సారి భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..లిస్టులో ఎవరున్నారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook