Tollywood Hero Nandamuri Balakrishna reacts on AP cinema ticket rate issue in Akhanda thanks meet : నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ అఖండ. (Akhanda) ఈ సినిమా సూపర్‌‌హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో అఖండ మూవీ యూనిట్ (Akhanda Movie) థ్యాంక్స్‌ మీట్‌ను (Thanks ‌Meet) నిర్వహించింది. ఈ సందర్భంగా బాలయ్య.. (Balayya) అఖండ మూవీ సక్సెస్‌తో (Akhanda Movie Success‌) పాటు ఏపీలో సినిమా టికెట్ రేట్ల (Movie ticket rates) అంశంపై మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్‌ సీజన్‌లో అఖండ మూవీ రిలీజై, పాన్‌ వరల్డ్‌ మూవీగా (Pan World Movie) నిలిచిందన్నారు బాలకృష్ణ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో కూడా అఖండ మూవీని ఆదరిస్తున్నారన్నారు. పాకిస్థాన్‌లోనూ (Pakistan‌) కూడా అఖండ మూవీని అద్భుతంగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. అక్కడి నుంచి కూడా తనకు వాట్సప్ వీడియోలు (WhatsApp videos) వస్తున్నాయని చెప్పుకొచ్చారు బాలయ్య.


అసలు సీజనే లేని సమయంలో డిసెంబరు 2న అఖండ రిలీజైందన్నారు బాలకృష్ణ. (Balakrishna) ప్రేక్షకులు తమ మూవీని అభిమానించి ఆదరించారన్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu Film Industry) మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని తాను కోరుకుంటున్నాని చెప్పారు. 


రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల (Two Telugu state governments) సహకారం టాలీవుడ్‌కు ఉండాలని కోరారు. ఈ విషయంలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే బేధం ఉండకూడదని పేర్కొన్నారు. అన్ని సినిమాలు ఆడాలని చెప్పుకొచ్చారు. 


Also Read : Covid-19 Update: రాష్టంలో 1,700 మంది పోలీసులకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు


ఇక ఏపీలో సినిమా టికెట్ల అంశంపై బాలకృష్ణ స్పందించారు. ఈ వివాదంపై సినీ పరిశ్రమ అంతా కలసికట్టుగా ఉండాలని బాలయ్య సూచించారు. సినిమా టికెట్‌ రేట్లపై (Movie ticket rates) ఇండస్ట్రీ తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఏపీలో (AP) సినిమా (Cinema) గోడును పట్టించుకునే నాథులు ఎవరునున్నారని బాలకృష్ణ (Balakrishna) పేర్కొన్నారు.


Also Read : Covid 19: బీజేపీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook