వరల్డ్ వైడ్ హై స్టాండర్డ్స్ ఉన్న IMDB ఆన్ లైన్  మ్యాగజైన్ 2017కు సంబంధించి ఇండియాలో టాప్ స్టార్స్ ఎవరనే విషయంపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  టాప్ -10 లిస్ట్ లో స్థానం దక్కించుకోవడం  గమనార్హం.  లిస్ట్ లో యంగ్ రెబల్ స్టార్ ది ఆరో స్థానం. బాహుబలి, బాహుబలి-2 సినిమాలతో నేషన్ వైడ్ పాపులర్ అయిన ప్రభాస్ ఈ లిస్ట్ లో చోటుదక్కించుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి నుంచి టాప్ -10 లిస్ట్ లో  చోటుదక్కించుకున్న ఒకే ఒక్క టాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించాడు ప్రభాస్. కాగా టాప్-10 లిస్ట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మొదటి 3 స్థానాల్లో నిలిచారు. 


IMDB ప్రొఫైల్స్ లో నెలకు 25 కోట్లు పేజ్ వ్యూస్ నమోదు చేసుకున్న స్టార్స్ మాత్రమే ఈ టాప్-10 లిస్టుకు ఎంపిక అవుతారు. దీన్ని బట్టి చూస్తే రెబల్ స్టార్ ప్రభాస్ కి వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ అర్థంచేసుకోవచ్చు. ఇక సౌత్ హీరోయిన్లకు  సంబంధించి మిల్కీబ్యూటీ తమన్నకు 4వస్థానం, అనుష్కకు 8వ స్థానం దక్కాయి.