Vijay Remuneration: తమిళ స్టార్ హీరో విజయ్​కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా ఆయన తీస్తున్న సినిమాలు సామాజిక స్పృహతో కూడుకున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. దీనితో తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ ఆ సినిమాలు డబ్​ అయ్యి మంచి విజయం సాధిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో విజయ్​ మార్కెట్​ భారీగా (Thalapathy Vijay) పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాస్టర్​ విజయంతో జోరు..


ఇక గత ఏడాది విడుదలైన మాస్టర్​ సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్​గా నిలిచిందో అందరికీ తెలిసిందే. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయాన్ని (Vijay Master movie hit) సాధించిందింది.


ఇక వరుస సక్సెస్​ఫుల్​ సినిమాలతో దూసుకుపోతున్న విజయ్​.. ఇప్పుడు స్ట్రెయిట్​ తెలుగు సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా (Vijay Telugu movie) విడుదలైంది.


వంశీ పైడిపల్లి (Vijay Cinema with Vamshi Paidipally) దర్శకత్వంలో విజయ్ ఈ సినిమా చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా ఏక కాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది. దిల్​ రాజు (Dil Raju movie with Vijay) ఈ సినిమాను నిర్మించనున్నారు.


అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ద్విభాషా చిత్రం కావడంతో ఈ సినిమాను భారీ బడ్జెట్​తో తెరకెక్కించనున్నారు దిల్​ రాజు. అయితే హీరో రెమ్యునరేషన్​ కూడా రికార్డు స్థాయిలో ఉంటుందని (Vijay Charge for Telugu movie) తెలుస్తోంది.


టాలీవుడ్​ వర్గాలు చర్చించుకుంటున్న విషయం ప్రకారం.. విజయ్ ఈ సినిమా కోసం రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు తెలిసింది. కేవలం హీరోకే ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తే.. సినిమా ఖర్చు ఎంత అవుతుందో అని చాలా మంది (Vijay Telugu movei Budget) లెక్కలేసుకుంటున్నారు.


వచ్చే నెల షూటింగ్ ప్రారంభం..


అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. విజయం ప్రస్తుతం 'బీస్ట్​' చిత్రం పనుల్లో బిజాగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న బీస్ట్​ సినిమా పోస్ట్ ప్రొడక్షన్​ పనులు జరుపుకుంటోంది. దాదాపు ఈ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఏప్రిల్​లో ఈ సినిమా విడుదలయ్యే (vijay beast release date) అవకాశముంది.


దీనితో వచ్చే నెల నుంచి తెలుగు, తమిళం చిత్ర షూటింగ్​లో విజయ్​ పాల్గొనే అవకాశముంది. బీస్ట్ ప్రమోషన్స్​ కారణంగా.. మార్చి నుంచి రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కావచ్చని తెలుస్తోంది. ఈ చిత్ర నటీనటులు, ఇతర టెక్నీషియన్స్​కు సంబంధించి వివరాలు కూడా త్వరలోనే (Vijay Telugu movie Updates) తెలిసే వీలుంది.


Also read: Tamannaah Bhatia: ఇట్స్ మీ టర్న్ అంటున్న తమన్నా సవాలుకు మీరు సిద్ధమేనా


Also read: Chiranjeevi Mother: నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలి! చిరంజీవి భావోద్వేగం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook