Tollywood Anuradha Suicide: ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ యువనటి.. కుళ్లిన మృతదేహం
సినిమా (Tollywood) అనేది ఒక రంగుల ప్రపంచం, ఈ రంగుల ప్రపంచంలో అందం, అభినయంతో ఒక వెలుగు వెలగాలని ఎందరో కోరుకుంటారు. సీనీ ప్రపంచంలో ఎందరో తారలు నెలకు ఒరిగారు.. కొందరు వ్యక్తిగత కారణాల వల్ల మరణిస్తే, మరికొంత మంది సినిమా రంగంలో రాణించలేక, అవకాశల కోసం వేచి చూసి, చూసి ప్రాణాలను పోగొట్టుకున్నారు.
Tollywood Artist Anuradha Suicide: సినిమా (Tollywood) అనేది ఒక రంగుల ప్రపంచం, ఈ రంగుల ప్రపంచంలో అందం, అభినయంతో ఒక వెలుగు వెలగాలని ఎందరో కోరుకుంటారు. సీనీ ప్రపంచంలో ఎందరో తారలు నెలకు ఒరిగారు.. కొందరు వ్యక్తిగత కారణాల వల్ల మరణిస్తే, మరికొంత మంది సినిమా రంగంలో రాణించలేక, అవకాశల కోసం వేచి చూసి, చూసి ప్రాణాలను పోగొట్టుకున్నారు.
అలాంటి సంఘటనే ఒకటి ఈ రోజు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ (Hyderabad Film Nagar)లో వెలుగు చూసింది. జూనియర్ ఆర్టిస్ట్ కావలి అనురాధ (Junior Artist Kavali Anuradha) ప్రేమ పేరుతో మోసపోవటం జీర్ణించుకోలేక ఊరి వేసుకుకొని ఆత్మహత్య చేసుకుంది. కుత్బల్లాపూర్ (Quthbullapur) గాజుల రామారం (Gajula ramaram) ప్రాంతానికి చెందిన కావలి అనురాధ (Kavali Anuradha) మూడు నెలలుగా కిరణ్ (Junior Artist Kiran) అనే జూనియర్ ఆర్టిస్ట్‌తో కలిసి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్ సింగ్ నగర్లో ఓ ఇంట్లో ఉంటుంది.
Also Read: Be Alert: రేపటి నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్ సేవలు బంద్
ఆమె గది నుండి దుర్వాసన వెలువడటంతో ఇంటి యజమానికి తెలుపగా అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గది తెరవగా కుళ్లిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహం కనపడింది. అనురాధ కుటుంబ సభ్యులకు తెలపగా, కిరణ్ తో ఆరేళ్లుగా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకోవాలనుకున్నారని తెలిపారు.
అయితే అనురాధ సోదరి తెలిపిన వివరాల ప్రకారం, కిరణ్ అనురాధకి తెలియకుండా వేరే అమ్మాయితో నిశ్చితార్దం జరిగిందని, విషయం తెలిసిన అనురాధ నిలదీయటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపింది. అంతేకాకుండా కిరణ్ గొడవ పై 3 రోజులుగా ఇంటి నుండి వెళ్లిపోయాడని, తిరిగి రాలేదని సోదరి తెలిపింది. కిరణ్ మోసాన్ని తట్టుకోలేక అనురాధ ఇలా చేసి ఉంటుందని ఆమె సోదరి తెలిపింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద కేసుగా నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు పోలీసులు.
Also Read: Godavari river: గోదావరి నీటి వివాదం.. తెలంగాణపై కేంద్రానికి ఎపీ సర్కార్ మరో ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook