Varun-Lavanya Love Affair: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మరో జంట ప్రేమ పెళ్లి చేసుకోనుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు కొత్త కాకపోయినా అన్నీ సవ్యంగా సాగడం లేదు. టాలీవుడ్ నటీనటులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ప్రేమ నిశ్చితార్దం వరకూ దారితీసింది. పెళ్లిపీటలెక్కనున్న ఈ ఇద్దరి లవ్‌స్టోరీ గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు సినీ పరిశ్రమలో నాగార్జున-అమల, నాగచైతన్య-సమంత, శ్రీకాంత్-ఊహ, మహేశ్ బాబు-నమ్రత ఇలా ప్రేమ వివాహాలు చేసుకున్నవారు చాలామంది ఉన్నారు. ఇదే పరిస్థితి కోలీవుడ్, బాలీవుడ్‌లో కూడా కొనసాగింది. ఇందులో నాగచైతన్య-సమంత బంధం మాత్రం వ్యక్తిగత కారణాలతో వీగిపోయింది. ఇప్పుడు మరో జంట పెళ్లిపీటలెక్కనుంది. గత కొద్దికాలంగా ప్రేమ వ్యవహారంలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు అందరి సమక్షంలో నిశ్చితార్ధం జరుపుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఇద్దరి మధ్య లవ్‌స్టోరీ ఎప్పుడు ఎలా ప్రారంభమైందనే వివరాలు మీ కోసం..


ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ సినిమాలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీలు కలిసి నటించారు. ఈ షూటింగే ఇరువురి మధ్య ప్రేమాయణానికి వేదికగా నిలిచింది. ఆ తరువాత ఓ వేడుకలో ఇద్దరూ మనసులో మాట పంచుకున్నారు. ఈ ఇద్దరు అంతటితో ఆగలేదు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పుకున్నారు. మిస్టర్ సినిమాతో మొదలైన ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిశ్చితార్ధం ఘనంగా జరుపుకున్నారు. ఈ ఇద్దరు మరోసారి అంతరిక్షం సినిమాలో కలిసి నటించారు. అటు మిస్టర్ సినిమా, ఇటు అంతరిక్షం రెండూ డిజాస్టర్లుగా నిలిచినా..ప్రేమ మాత్రం సక్సెస్ అయింది. 


నాగబాబు ఇంట్లో నిశ్చితార్ధం ఘనంగా జరగగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అరవింద్ సహా అందరూ హాజరయ్యారు. నిశ్చితార్ధం వేడుక అత్యంత ఘనంగానే జరిగింది. లావణ్యకు తొడిగిన డైమండ్ రింగ్ ఖరీదు 25 లక్షలు ఉండవచ్చని ఓ అంచనా. నిశ్చితార్ధం సందర్భంగా ఈ ఇద్దరూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్ని ధరించారు. 


వరుణ్ తేజ్ తొలిసారిగా బాలనటుడిగా హ్యాండ్సప్ చిత్రంలో కన్పించగా అడ్డాల శ్రీకాంత్ తెరకెక్కించిన ముకుందాలో హీరోగా పరిచయమయ్యాడు. కంచె సినిమాతో మరో హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక లోఫర్, మిస్టర్, అంతరిక్షం సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. అదే సమయంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదాతో మరో హిట్ కొట్టేశాడు. ఇక ఆ తరువాత హీరో వెంకటేశ్‌తో కలిసి చేసిన ఎఫ్ 2, ఎఫ్ 3లు మేజర్ హిట్ సాధించాయి. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేశ్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.


Also read: Adipurush Controversy: నెలసరి మహిళలు ఆదిపురుష్ చూడొచ్చా ? బాబు గోగినేని సెటైర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook