Chiranjeevi hails his Wife Surekha in International Women's Day: నేడు మహిళా దినోత్సవం. మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో అందిస్తున్న సేవల గురించి గుర్తు చేసుకునే రోజే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచం మొత్తం ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటోంది. లింగ సమానత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా సాధించే దిశగా ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని చోట్ల సత్కారాలు, సన్మానాలు జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలోని 'చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌'లో సంబరాలు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, సోదరి మాధవీలతలు బ్లడ్‌ బ్యాంక్‌, సినీ పరిశ్రమలోని పలువురు మహిళా కార్మికులకు సన్మానం చేశారు. వారికి చీరలు, బహుమతులను అందజేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ అందిరికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. తాను సక్సెస్‌ఫుల్ హీరోగా ఉండటానికి ప్రధాన కారణం తన సతీమణి సురేఖ అని చెప్పారు. 


'ముందుగా ప్రతిఒక్కరికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. షూటింగ్ సమయంలో మీరు తీసుకునే శ్రద్ద, కష్టం చూసి ఈరోజు ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నాను. ఇదే విషయాన్ని సురేఖకు చెపితే..అన్ని తానే చూసుకుంది. మీరు పడిన కష్టం చూస్తే.. నేను చిన్నతనంలో మా అమ్మ పడే కష్టం గుర్తుకువచ్చింది. మా అమ్మగారికి నేను 16వ ఏట జన్మించాను. ఆ సమయంలో ఇంటి పనులుతో పాటు నన్ను చూసుకునేది. నాన్న తిండి విషయంలో ఏ మాత్రం తగ్గరు. అందుకోసం అమ్మ ఎంతో కాస్త పడేది. అందుకే నేను శ్రీ పక్షపాతి అయిపోయాను' అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 


'అల్లువారి ఇంట్లో సురేఖ గారాల పట్టి. కానీ మా ఇంటికి వచ్చేసరికి పెద్ద కోడలు. కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఆమెకు క్షణం తీరిక ఉండేది కాదు. మా తల్లిదండ్రులు, తమ్ముళ్లకు, చెల్లెలు ఏమీ కావాలో అన్ని తానే చూసుకునేది. దాంతో నేను పూర్తిగా సినిమాపై దృష్టి పెట్టాను. నేను సక్సెస్‌ఫుల్ హీరోగా ఉండటానికి ప్రధాన కారణం సురేఖనే. ఈ సందర్భంగా ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా' అని చిరంజీవి పేర్కొన్నారు. నేటి మహిళలు చంద్రమండలం, ఒలింపిక్స్‌ స్థాయికి ఎదుగుతున్నారని.. మహిళా సాధికారత కోసం అందరూ కృషి చేయాలన్నారు. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలని చిరు ఆకాంక్షించారు.


Also Read: Rashmika Mandanna: రష్మిక మందన్న క్రేజ్ మాములుగా లేదుగా.. బాలీవుడ్ స్టార్ హీరోతో..!!


Also Read: Indian in Ukraine Army: యుద్ధ సమయంలో ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన భారత విద్యార్థి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook