Tollywood Movies this Week: బ్రహ్మాస్త్ర, ఒకే ఒక జీవితం సహా ఈ వారం విడుదలవుతున్న సినిమాలివే!
Tollywood Movies Releasing this Week: ఈ వారం పలు ఆసక్తికర సినిమాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.
Tollywood Movies Releasing this Week: ప్రతివారం లాగానే ఈ వారం కూడా పలు ఆసక్తికర సినిమాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం ఏఏ సినిమాలు థియేటర్లో, ఏ ఏ సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి అనే విషయం పరిశీలిస్తే బాలీవుడ్ నుంచి మొట్టమొదటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా బ్రహ్మాస్త్ర విడుదలవుతోంది. రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు.
తెలుగులో ఈ సినిమాని బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్,ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. దక్షిణాదిలో ఈ సినిమాని రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబచ్చన్, షారుక్ ఖాన్, నాగార్జున వంటి వారు కూడా ఇతర కీలక పాత్రలలో కనిపించారు.
అదే రోజు శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతూ శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా కూడా సెప్టెంబర్ 9వ తేదీన విడుదలవుతోంది. అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించారు. వినాయక్ దేశాయి, పాయల్ ముఖర్జీ, వైష్ణవి సింగ్, నాగరాజు, సత్య ప్రకాష్ కీలక పాత్రలలో రూపొందిన శ్రీరంగాపురం అనే సినిమా కూడా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలవుతోంది. అలాగే తెలుగు నుంచి మరో సినిమా కూడా విడుదలవుతోంది.
అజయ్, కీర్తి వఘాని జంటగా హనుమాన్ దర్శకత్వంలో రూపొందిన కొత్త కొత్తగా అనే సినిమా కూడా అదే రోజు విడుదలవుతోంది. గోవిందరాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇక ఇవి కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో థోర్ లవ్ అండ్ థండర్ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 9వ తేదీన ఏక్ విలన్ రిటర్న్స్ స్ట్రీమ్ అవ్వబోతోంది. అలాగే ఆహాలో సెప్టెంబర్ 11న డాన్స్ ఐకాన్ అనే రియాలిటీ షో కూడా ప్రారంభం కాబోతోంది. ఈ రియాలిటీ షో కి ఓంకార్ యాంకర్ గా వ్యవహరించబోతున్నారు. ఇక తొమ్మిదో తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో సీతారామం సినిమా కూడా స్ట్రీమ్ కాబోతోంది.
Also Read: Director Sudheer Varma Upset: నిర్మాతల తీరుతో మనస్థాపం.. ప్రమోషన్స్ కు డైరెక్టర్ డుమ్మా!
Also Read: Shanmukh Jaswanth Hospitalised: ఆసుపత్రి పాలయిన షణ్ముఖ్ జస్వంత్ .. ఆందోళనలో ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి