Telugu Movie News: న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు సినీ ప్రేక్షకులకు నిన్న రంగ రంగ వైభవంగా ఎన్నో సినిమాల నుంచి ఎన్నో పోస్టర్లు విడుదలై అలరించాయి. మహేష్ బాబు గుంటూరు కారం దగ్గర నుంచి సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా పోస్టర్ల వరకు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆ చిత్ర మేకర్స్ న్యూ ఇయర్ పోస్టర్లను విడుదల చేశారు. దీంతో అందరి హీరో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ దేవర ఫస్ట్ గ్లిమ్స్ జనవరి 8న విడుదల చేస్తాము అంటూ రిలీజ్ అయిన పోస్టర్ అందరిని తెగ ఆకట్టుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టర్లే కాకుండా ఎన్నో ఈవెంట్లు కూడా చోటు చేసుకున్నాయి. ఫిలింనగర్ లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో FNCCలో  నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం చివరి రోజు డిసెంబర్‌ 31 రాత్రి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఇనఫ్యూజన్  బ్యాండ్‌చే ఏర్పాటు చేసిన సంగీత విభావరి, బెలీ  డాన్స్,  30 మంది ముంబై యువకులు చేసిన  ఎరోబిక్స్‌ డాన్స్, జోడీ డాన్స్  ఆహుతులను అలరించాయి. ఇక ఈ సెలబ్రేషన్స్ లో ఎంతోమంది సినీ, రాజకీయ నాయకులు పాల్గొన్నారు ‌ 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఈ సెలబ్రేషన్స్ ని ఆకాశాన్ని అంతేలా జరిపారు. 


ఇక ఈ ఈవెంట్ లో సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ " గతంలో  ఉన్న కమిటీ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ను ఎంతో అభివృద్ధి చేసింది. మేము అందరం కూడా అదే దిశగా ముందుకు తీసుకెళతాం . దక్షిణాదిలో నంబర్  వన్ కల్చరల్ సెంటర్ గా తీర్చిదిద్దుతాం" అని తెలియజేశారు, 


ఈ కార్యక్రమంలో ఆదిశేషగిరిరావు, ఎఫ్‌ ఎన్ సీ సీ  ప్రెసిడెంట్‌ జి. వైస్‌ ప్రెసిడెంట్‌ తుమ్మల రంగారావు, సెక్రటరీ ముళ్లపూడి మోహన్,  ట్రెజరర్‌ బి రాజశేఖరరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ పెద్దిరాజు, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, కె మురళీమోహన్ , శైలజా జుజల, బాలరాజు, గోపాలరావు, ఏడిద రాజా మోహన్  వడ్లపట్ల, ఇంద్రపాల్‌రెడ్డి, వరప్రసాదరావు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 


Also read: PPF Benefits: నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి 26 లక్షలు పొందే అద్భుత పధకం


Also read: Japan Earthquake: న్యూ ఇయర్ నాడు జపాన్‌ను వణికించిన భారీ భూకంపం, ఫోటోలు వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook