Krishna Bronze Statue: తండ్రి కోసం 30 అడుగుల కాంస్య విగ్రహం, మ్యూజియం ఏర్పాటుకు మహేశ్ నిర్ణయం
Krishna Bronze Statue: టాలీవుడ్ నాటి తరం మేటి నటుడు సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో లక్షలాదిమంది అభిమానులు ఇంకా శోకం నుంచి తేరుకోలేదు. కుమారుడు మహేశ్ బాబు పరిస్థితి మరీ ఘోరం. ఏడాదిలో ముగ్గురిని కోల్పోయాడు.
సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో యావత్ సినీలోకం, అభిమానులు విచారంలో మునిగిపోయారు. ఏడాది వ్యవధిలో తల్లి, తండ్రి, అన్నయ్యను కోల్పోయిన మహేశ్ బాబు పరిస్థితి మరీ వర్ణణాతీతమని చెప్పవచ్చు. తండ్రికి గుర్తుగా మహేశ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు.
సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో కుమారుడు మహేశ్ బాబు మానసికంగా కృంగిపోయాడు. ఒకే ఏడాది కుటుంబంలో ముగ్గురిని కోల్పోవడమంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క మహేశ్‌కే తెలుస్తుంది. ముందు సోదరుడు రమేష్ బాబు, తరువాత తల్లి ఇందిరాదేవి, ఇప్పుడు తండ్రి కృష్ణ. బాల్యం నుంచి తండ్రితో కలిసి సినిమాల్లో నటించిన మహేశ్ బాబుకు తండ్రే సర్వస్వం. ఆయనే అతడికి బలం, బలహీనత కూడా.
అందుకే తండ్రి జ్ఞాపకార్ధం సరికొత్త పనికి శ్రీకారం చుట్టనున్నాడు మహేశ్ బాబు. హైదరాబాద్ నగరంలో తండ్రికి గుర్తుగా సూపర్‌స్టార్ కృష్ణ మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యూజియంలో 30 అడుగుల తండ్రి కాంస్య విగ్రహం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. దాంతోపాటు తండ్రి నటించిన 350 సినిమాల ఫోటోలు, షీల్డులు, సాధించిన రికార్డులు వంటి వివరాలన్నీ ఉంటాయి. కుటుంబంతో తండ్రికున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసేలా మ్యూజియం నిర్మాణం ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమకు అన్నీ కొత్తగా పరిచయం చేసి..ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన కృష్ణ ..ఈ గౌరవానికి అర్హుడని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు.
మహేశ్ బాబు మొన్నటివరకూ త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనిలో ఉన్నాడు. అయితే సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరాదేవి మరణించడంతో..షూటింగ్ మధ్యలో నిలిపేశారు. ఇటీవల తిరిగి ప్రారంభిద్దామనుకునేలోగా..తండ్రి మరణించడంతో మహేశ్ బాబు మానసికంగా కృంగిపోయాడు.
Also read: Liger Movie: పూరీ, ఛార్మీలకు లైగర్ కొత్త కష్టాలు, ఈడీ విచారణకు హాజరైన ఇద్దరు నిర్మాతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook