Tollywood Tier 2 Heroes: సతమతమవుతున్న టైర్ 2 హీరోలు…కారణం 25 కోట్లు మాత్రమే !
Mid Range Heroes: తెలుగు సినీ ఇండస్ట్రీకి వెన్నుపూస లాంటి మిడ్ రేంజ్ సినిమాలు ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బడ్జెట్ ఒకపక్క సమస్య అనుకుంటే ఇప్పుడు మార్కెటింగ్ కూడా మరో పక్క సమస్యగా మారుతుంది.
Nani: రవితేజ ,నాని ,నాగచైతన్య, విజయ్ దేవరకొండ,కళ్యాణ్ రామ్,సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శర్వానంద్, గోపీచంద్, నితిన్, విజయ్ దేవరకొండ..ఇలా టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోల సంఖ్య ఎక్కువే. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ఈ హీరోల సినిమాలు రాను రాను బాగా తగ్గిపోతున్నాయి. దీనికి బడ్జెట్ ముఖ్య కారణమైతే మరొక స్ట్రాంగ్ రీసన్ మార్కేట్ వాల్యూ.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక మిడ్ రేంజ్ హీరో సినిమా తీయాలి అంటే కనీసం 45 కోట్లు ఖర్చు అవుతుంది. కాస్త బడ్జెట్ ఎక్కువ పెట్టి హంగులతో తీయాలి అంటే 75 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి.ఈ బడ్జెట్ హీరో పారితోషకం పై ఆధారపడి ఉంటుంది. హీరో పారితోషకం 10 నుంచి 15 కోట్ల మధ్యలో ఉంటే సినిమా బడ్జెట్ అంతా కలిపి 45 కోట్ల లో పూర్తయిపోతుంది. అలాకాకుండా హీరో ఓ 25 కోట్లు డిమాండ్ చేశాడనుకోండి సినిమా బడ్జెట్ ఈజీగా 75 కోట్లకు వెళ్ళిపోతుంది.
అయితే అక్కడితో సినిమా అయిపోలేదు నెక్స్ట్ మార్కెటింగ్ అనే పెద్ద సమస్య స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నాని, విజయ్ దేవరకొండ.. ఇలా ఒక నలుగురు ఐదుగురు హీరోలను తీసి పక్కన పెడితే మిగిలిన వారికి నాన్ థియరీటికల్ మార్కెట్ కంప్లీట్ అవ్వడం కష్టంగా మారుతుంది. రీసెంట్ గా విడుదలైన రవితేజ ఈగల్ చిత్రం నాన్ థియరిటికల్ అమ్మకాలు జరగకుండానే థియేటర్లలో విడుదల చేశారు. దీన్ని బట్టి మిడ్ రేంజ్ హీరోల మార్కెట్ ఎలా ఉందో ఆలోచించండి.
నిర్మాత ఏదో కష్టపడి తన పేరు ఉపయోగించి నాన్ థియరీటికల్ అమ్మకాలు గట్టెక్కించినా.. థియేటర్ మార్కెట్ అనేది మరొక పెద్ద సమస్యగా మారుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిడ్ రేంజ్ హీరో ఆయినా.. కొత్త స్టార్ అయినా.. థియేటర్ల మీద కనీసం 25 కోట్లు వసూలు చేయాల్సిందే. అయితే ప్రస్తుతం ఉన్న మిడ్ హీరో లలో అంత థియేటర్ మార్కెట్ చాలామందికి లేదు. గట్టిగా ఓ 15 కోట్ల వరకు వస్తాయి కానీ అంతకుమించి వసూలు చేసే అవకాశం లేదు.
నాని లాంటి స్టార్స్ కైతే ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ ను బట్టి వసూళ్లు బాగా వస్తాయి . రీసెంట్గా విడుదలైన నాని హాయ్ నాన్న చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ థియేటర్ల నుంచి 25 కోట్లు అతి కష్టం మీద వసూలు చేయగలిగింది. ఇప్పటికే ఆల్రెడీ కమిట్ అయిన కొన్ని మిడ్ రేంజ్ హీరోల సినిమాలు ఇంకా సెట్స్ మీదకి రాలేదు. ఇవి కంప్లీట్ అవుతాయా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. వీళ్లు తమ పారితోషకాలు కనీసం సగానికి సగమైన తగ్గించుకోవాలి లేకపోతే ఫ్యూచర్ లో కెరీర్ సమస్య అధికమవుతుంది. ఈ నేపథ్యంలో మిడ్ రేంజ్ హీరోలా ఫ్యూచర్ టాలీవుడ్ లో డోలమాయమానంగా మారుతుంది.
Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే
Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook